ఏపీలో మెడికల్ ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు తొలిసారిగా రాష్ట్రానికి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రానుంది. ఈ మేరకు బెంగాల్ నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఏపీకి చేరుకోనుంది. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్లాంట్ నుంచి 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకుని ఏపీకి బయలుదేరింది. ఏపీలోని వివిధ ఆస్పత్రులకు ఈ ఆక్సిజన్‌ను పంపిణీ చేసేందుకు వీలుగా విశాఖ, నెల్లూరు స్టేషన్‌లలో ప్రాణవాయువును అప్‌లోడ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఏపీలో రోజుకు దాదాపు 600 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతున్నా తమిళనాడు, ఒడిశా నుంచి రోడ్డుమార్గంలోనే సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ రవాణా సమయాన్ని తగ్గించేందుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ నడుపుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement