Saturday, November 23, 2024

సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా.. రేపే టీ హబ్ 2 ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అంకుర కంపెనీల ఇంక్యుబేటర్‌ టీ హబ్‌ రెండో విడతను మంగళవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో టీ హబ్‌ టూ భవనాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. తద్వారా నూతన ఆలోచనలను మరిన్ని స్టార్టప్‌లకు మంచి వాతావరణాన్ని కల్పించినట్లు అవుతుందని మంత్రి ట్వీట్‌ చేశారు. భవిష్యత్తును ముందుగానే చెప్పాలంటే దానికి సృష్టించడమే మార్గమన్న అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహాం లింకన్‌ వ్యాఖ్యలను కేటీఆర్‌ ఈ సందర్భంగా ఉటంకించారు. హైదరాబాద్‌ రాయదుర్గంలో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ కానుందని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఫేజ్‌-1 ద్వారా 1100 కంపెనీలు రూ.1860 కోట్ల నిధులు సేకరించాయని కేటీఆర్‌ వెల్లడించారు. కార్యక్రమానికి యూనికార్న్‌ స్టార్టప్‌లు మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్‌ కేర్‌, డెలివరీ వ్యవస్థాపకులతో పాటు సీక్యా క్యాపిటల్‌, యాక్సెల్‌, ఎండియా పార్ట్‌నర్స్‌, కలారి క్యాపిటల్‌ వంటి వెంచర్‌ పెట్టుబడిదారులు, మారుతి సుజుకి, కోటక్‌ మహీంద్రాబ్యాంక్‌, ఎస్‌ఏపీ వంటి కార్పొరేట్‌ దిగ్గజాల ప్రతినిధులు హాజరు కానున్నారు. అంకురాలతో పాటు వెంచర్‌ క్యాపిటలిస్టులను కూడా టీ హబ్‌ రెండో దశలో చోటు కల్పించనున్నారు. ఈ భవనం దేశంలోనే అతిపెద్ద ప్రపంచంలో రెండో పెద్ద ఇంక్యుబేటర్‌గా నిలవనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ ఎకోసిస్టం మరింతా బలపడుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. టీ హబ్‌ రెండో దశతో రాష్ట్ర ఖ్యాతి జాతీయ స్థాయిలో మరింత ఇనుమడిస్తుందని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement