Tuesday, November 26, 2024

ఐపీఓ బౌండ్‌ ఓయోలోని 500 ఉద్యోగులు.. 3 కోట్ల షేర్లను కొనుగోలు..

రెగ్యులేటరీ ఫైలింగ్‌ ప్రకారం.. ఐపీఓ బౌండ్‌ ఓయోలోని 500 మంది కంటే ఎక్కువ తాజా, మాజీ ఉద్యోగులు కంపెనీలోని 3కోట్ల షేర్లను కొనుగోలు చేయడానికి తమ స్టాక్‌ ఆప్షన్స్‌ గ్రాంట్‌లను ఉపయోగించారు. ఫైలింగ్‌ల ప్రకారం.. ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు వారి వెస్టెడ్‌ ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌ (ఈఎస్‌ఓపీలు)ను ఉపయోగించడం ద్వారా ఈ షేర్‌లను కొనుగోలు చేశారు. కరోనా ప్రభావ సమయంలో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించింది. ఆ సమయంలో.. ఓయో.. ప్రస్తుతం, మాజీ ఉద్యోగులకు ఈఎస్‌ఓపీలను అందించింది. గతేడాది ఆగస్టులో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ నుంచి 5 మిలియన్‌ డాలర్లు సేకరించినప్పుడు.. ఓయో విలువ 9.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

ఓయోను నడిపిస్తున్న ఓరవెల్‌ స్టెయిస్‌ లిమిటెడ్‌ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కొనుగోలు చేసిన షేర్ల మొత్తం విలువ సుమారు రూ.330 కోట్లు ఉంటుందని అంచనా. ఓయో.. తన ఈఎస్‌ఓపీను 41 శాతం విస్తరించింది. ఓయోలోని ప్రస్తుత ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మందికి ఈఎస్‌ఓపీలు మంజూరు చేయబడినట్టు అంచనా వేశారు. మార్చి 31, 2021 నాటికి.. ఓయో ప్రపంచ వ్యాప్తంగా 5,130 మంది ఉద్యోగులను మాత్రమే కలిగి ఉంది. ఈ మొత్తం ఉద్యోగుల్లో.. 70.9 శాతం మంది ఉద్యోగులు భారత్‌లోనే ఉండటం గమనార్హం. గత సంవత్సరం.. అక్టోబర్‌లో కంపెనీ ప్రారంభ వాటా విక్రయం ద్వారా రూ.8,430 కోట్లను సమీకరించడానికి మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)కి పత్రాలను అందజేసింది. ఐపీఓ దాని డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ ప్రకారం.. రూ.7,000 కోట్ల వరకు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూ.1,430 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూని కలిగి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement