Friday, September 20, 2024

ENG vs SA | ఉత్కంఠ పోరులో సఫారీలదే విజయం..

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఇంగ్లండ్ ముందు 164 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆఖరి వరకు పోరాడి 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.

స‌ఫారీలు నిర్దేశించిన‌ ఛేద‌న‌లో ఇంగ్లండ్ టాపార్డ‌ర్ విఫలమైంది.. మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(52), లియం లివింగ్‌స్టోన్‌(33) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, మిగిలినవారు అంగతా రాణించలేదు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా, కేశవ్ మహారాజ్ రెండేసి వికెట్లు తీయ‌గా.. ఒట్నియెల్ బార్ట్‌మన్, అన్రిచ్ నోర్ట్జే చెరో వికెట్ ద‌క్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement