హైదరాబాద్ నగరంలో మరోసారి పేలుడు మూలాలు బయటపడ్డాయి. ఈనెల 17న బీహార్‌లోని దర్బంగా రైల్వేస్టేషన్‌లో జరిగిన పేలుడు మూలాలు హైదరాబాద్‌లో దొరికాయి. ఈనెల 16న దర్బంగా రైల్వేస్టేషన్‌కు సికింద్రాబాద్ నుంచి ఓ పార్శిల్ వెళ్లినట్లు బీహార్ రైల్వే పోలీసులు గుర్తించారు. దర్భంగాలో ఏటీఎస్ పోలీసులు రైలు నుంచి ఓ వస్త్రాల పార్శిల్ తీస్తుండగా పేలుడు సంభవించింది. కాగా పేలుళ్లకు కారణమైన వస్త్రాల పార్శిల్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. అయితే ఈ పార్శిల్‌ను హైదరాబాద్ ఆసిఫ్ నగర్‌కు చెందిన ఇమ్రాన్, నజీర్ పంపినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ఏటీఎస్ బృందం నిందితులను అదుపులోకి తీసుకుని బీహార్ వెళ్లింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement