హైదరాబాద్, ఆంధ్రప్రభ: మన యూనివర్సిటీ మన ఉస్మానియా పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పీహెచ్‌డీ అడ్మిషన్లు చేపడుతామ ని ఉస్మానియా వీసీ ప్రొ.రవీంద్ తెలిపారు. ఉస్మానియా వైస్ ఛాన్సలర్(వీసీ)గా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వీసీ ప్రొఫెసర్ రవీందర్ మీడియా సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 పాయింట్ల ఎజెండాతో వర్సిటీ అభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందించామన్నారు. ఈ ఏడాదిలో మైనింగ్ లాంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం సివిల్ సర్వీసెస్ అకాడమీ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు ఆర్ట్స్ కాలేజీ ముందు నిరసనలు జరుగుతున్నాయనే అపవాదు ఉంది. విద్యార్థుల ఆందోళనలు.. మీటింగ్‌లు.. చర్చలు చేసుకునేందుకు వీలుగా 18 లక్షలతో సెంటర్ ఫర్ డిస్కోర్స్ ఏర్పాటు చేశామన్నారు. బార్ కోడింగ్‌తో కూడిన యూనిక్ ఐడీ కార్డు ఫస్టియర్ విద్యార్థులకు అందిస్తున్నట్లు పేర్కొన్నా రు. మహిళల భద్రత కోసం వర్సిటీలో 120 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ఎక్స్ సర్వీస్ మెన్‌తో సెక్యూరిటీ సిస్టం అందుబాటులోకి తెచ్చా మన్నారు. అమ్మాయిలను హాస్టళ్ల నుంచి కాలేజ్‌కు వచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. యూనివర్సిటీలో అమ్మాయిల భద్రత కోసం షీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. టీచర్లకు రీసెర్చ్ కార్పస్ ఫండ్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.వచ్చే నెలలో సెంటర్ ఫర్ ఇండో పసిఫిక్ సెంటర్‌ను ప్రారంభిస్తామని వీసీ తెలిపారు.
మన యూనివర్సిటీ మన ఉస్మానియా పేరుతో కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదిలో 50 టీచర్లకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా ప్రమోట్ చేసినట్లు, 120 మంది పార్ట్‌టైం లెక్చరర్లను నియమించినట్లు వివరించారు. రూ.100 కోట్లతో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు.. సుందరీకరణ చేయబోతున్నట్లు చెప్పారు. సెంటనరీ సెలబ్రేషన్స్‌కు గుర్తుగా తరలో పైలాన్ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్ పేరుతో కొత్త ఆలోచనలను ఆహానిస్తున్నామని చెప్పారు.త్వరలో వర్సిటీ స్టూడెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 9 అటానామస్ కాలేజీలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 13 కోట్లతో చేపట్టిన ఖేలో ఇండియా ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ పార్కు.. బయో డై వర్సిటీ పార్కులను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్రాలపై రుద్దడం సరైంది కాదన్నారు. అమలు చేస్తున్న కర్నాటక లాంటి రాష్ట్రాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యని, దీనిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని వీసీ రవీందర్ తెలిపారు. ఈసమావేశంలో ఉస్మానియా వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..