Friday, November 22, 2024

అమెరికాకు మన ఫోన్లు.. పెరుగుతున్న ఎగుమతులు

మన దేశంలో తయారవుతున్న స్మార్ట్‌ ఫోన్లు భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా మూడోవంతు ఫోన్లు అమెరికాకు ఎ గుమతి అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పిత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌) మూలంగా దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ ఊపందుకుంది. చైనాకు చెందిన వివిధ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో పాటు, అమెరికాకు చెందిన యాపిల్‌ కంపెనీ కూడా ఇండియాలో తయారీ చేపడుతున్నాయి. ఆయా కంపెనీలు మన దేశంలో ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. యాపిల్‌ ఫోన్లను ప్రధానంగా ఫ్యాక్స్‌కాన్‌ తయారు చేస్తోంది. ఇక్కడ తయారవుతున్న ఫోన్లు విదేశాలకు భారీగానే ఎగుమతి అవుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్లను తయారు చేసే దేశీయ కంపెనీలు మాత్రం దాదాపు లేనట్లే.

- Advertisement -

కొన్ని దేశీయ బ్రాండ్లు ఉన్నప్పటికీ అవి ఎగుమతి చేసే స్థాయిలో ఉత్పత్తి చేయడంలేదు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్‌ – మే నెలల్లోనే 2.43 బిలియన్‌ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను మన దేశం ఎగుమతి చేసింది. మన దేశంలో తయారువుతున్న వాటిలో ఎక్కువ భాగం అమెరికానే దిగుమతి చేసుకుంటోంది. విలువపరంగా మూడో వంతు మొబైల్‌ ఫోన్లను అమెరికానే దిగుమతి చేసుకుందని ప్రభుత్వం వెల్లడించిన డేటా వెల్లడించింది. 2022-23 ఏప్రిల్‌- మే నెలల్లో అమెరికాకు 92.2 మిలియన్‌ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు జరిగాయి.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2023-24లో అవే రెండు నెలల్లో ఎగుమతుల విలువ 812.49 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఒక్క సంవత్సరంలోనే ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మన దేశం నుంచి స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతి విషయంలో అమెరికా తరువాత యూఏఈకి 484.52 మిలియన్‌ డాలర్లు, నెదర్లాండ్స్‌కు 205 మిలియన్‌ డార్లు, యూకేకు 151.33 మిలియన్‌ డాలర్లు, ఇటలీకి 136.57 మిలియన్‌ డాలర్లు, చెక్‌ రిపబ్లిక్‌కు 115.5 మిలియన్‌ డాలర్ల విలువైన స్మార్ట్‌ ఫోన్లు ఎగుమతులు జరిగాయి.

2022-23లో మొత్తంగా 10.95 బిలియన్‌ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు భారత్‌ నుంచి ఎగుమతి అయ్యాయి. గత సంవత్సరం ఏప్రిల్‌-మే నెలతో పోలిస్తే ఈ మొత్తం 57.82 శాతం పెరిగాయి. 2022-23కు ముందు దేశం నుంచి స్టార్ట్‌ఫోన్ల ఎగుమతి జరగలేదు. ప్రభుత్వం పీఎల్‌ఐ స్కీమ్‌ తీసుకు రావడంతో యాపిల్‌తో పాటు, పలు ప్రముఖ కంపెనీలు దేశీయంగా స్మార్ట్‌ ఫోన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. దీంతో ఎగుమతులు పెరుగుతున్నాయి. మన దేశం క్రమంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ హబ్‌గా మారుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement