ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు పోలీసు ఉన్నతాధికారులు మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పోలిటి బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంటు తెదేపా అభ్యర్థి కేసినేని శివనాద్, జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభి ఆరోపించారు. ట్యాప్ కు సంబంధించి తమ వద్ద కీలక సమాచారం ఉందని, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ని పట్టుకుంటే విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు.
విజయవాడలో ని యేసు నేను చిన్ని కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బోండా ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టు ఆధారాలను బోండా ఉమామహేశ్వరరావు బయటపెట్టారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా అభియోగం చేశారు.
సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందన్నారు. గతంలో తాము ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాధ్ వెల్లడి చేశారన్న గుర్తు చేశారు. గత తెలంగాణ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినప్పుడే ఏపీ సీఎం జగన్ అదే తరహా సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. మేమిచ్చిన కంప్లైంటుపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవాళ పార్టీ అభ్యర్థులతో ఓ వర్క్ షాప్ నిర్వహించాం అని, ఆ సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి మా సమావేశంలోకి వచ్చాడన్నారు. ఐజీ పంపితేనే వచ్చానని ఆ కానిస్టేబుల్ చెప్పారని తెలిపారు.కేశినేని చిన్ని కదలికల మీద నిఘా పెట్టినట్టు మాకు తెలిసిందన్నారు. కేశినేని చిన్నిని కదలికలపై నిఘా పెట్టి ఫోన్లను ట్యాప్ చేసిన ఆధారాలు మా వద్ద ఉన్నాయన్నారు. మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్లో మాకు లభ్యమయ్యాయన్నారు.
టిడిపి విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాద్ మాట్లాడుతూ తెలంగాణలో కూడా ఇదే తరహాలో ట్యాపింగ్ ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు నిర్దారణైందన్నారు. ఫోన్ ట్యాపింగుపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు..? అని ప్రశ్నించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నారు. పీఎస్సార్ ఆంజనేయులుతో సహా ఫోన్ ట్యాపింగుకు పాల్పడిన వారిని విధుల నుంచి తప్పించాలన్నారు.
వైసీపీ నేతలు బరి తెగించారన్న ఆయన ప్రధాని సభకు వచ్చినందుకు ఏకంగా హత్యలే చేసేశారన్నారు. దాడులు వైసీపీకి ఓ లెక్కే కాదన్నారు. నా ఫోన్ ట్యాప్ చేసేలా ఇంటెలిజెన్స్ ప్రయత్నించిందని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛని హరించేలా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు తొత్తుల్లా కొదరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ సీనియర్ నేత పట్టాభి మాట్లాడుతూ టీడీపీ నేతలపై నిఘా పెట్టే బదులు.. డ్రగ్స్ ఎవరు తెచ్చారనే అంశంప్ పీఎస్సార్ ఆంజనేయులు దృష్టి పెట్టాలన్నారు. జగన్ సింగిల్ కాదు.. ఆయన వెంట మాఫియా ఉందన్నారు. జగన్ మాఫియాకు.. ప్రజలకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు. కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఐపీఎస్ లా కాకుండా.. జేపీఎస్ తరహాగా మారారన్నారు. జగన్ పోలీస్ సర్వీసెస్ అన్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్పారు. టెక్నాలజీతో మాపై నిఘా పెట్టె బదులు డ్రగ్స్ కంటైనర్ల మీద నిగా పెట్టాలని సూచించారు.