దుబ్బాక : గ్యాస్ ధరను పెంచిన బీజేపీని గద్దె దించేవరకు మా ఉద్యమం ఆగదు అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్యాస్ ధరలు పెంపుకు నిరసనగా దుబ్బాక పట్టణంలో స్థానిక బస్టాండ్ ఎదుట బీఆర్ఎస్ ధర్నాలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక బస్టాండ్ ఎదుట దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్యాస్ ధరలు పెంచడం సామాన్యుల నడ్డి విరవడమే అన్నారు. రూ. 1175 రూపాయలతో గ్యాస్ కొనడం దారుణం అన్నారు. నల్లధనం వెలికి తీస్తానని గతంలో చెప్పిన మోడీ నేటికీ తీసింది లేదు అని, 15 లక్షలు అకౌంట్లో వేసింది లేదు అన్నారు. వేల కోట్ల విలువ చేసే ఆస్తులను మోడీ అమ్మకానికి పెట్టడం దారుణం అన్నారు. దేశంలో ఏ టెండర్ పడ్డ గుజరాత్ కంపెనీకె అప్పజెప్పుతుంది మోడీ ప్రభుత్వం అన్నారు. నీచ నికృష్టమైన పరిపాలన దేశంలో కొనసాగుతుందన్నారు. పొద్దున లేస్తే కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని తిట్టడమే బీజేపీ నాయకుల పనిగా మారిందన్నారు. గతంలో వాజ్ పేయి పాలించిన బీజేపీ పాలన ఎటు పోయింది? ఇప్పుడు ఇంత దౌర్భాగ్య మోడీ పాలన ఎందుకు వచ్చింది?, బిజెపిని గద్దె దించేందుకే బీఆర్ఎస్ స్థాపించడం జరిగిందన్నారు. పెద్ద పెద్ద కంపెనీలను చేజిక్కించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా అన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎటు పోయిండు.. రాజీనామా చేసిండా? అన్నారు. అబద్ధాలు ఆడి గద్దెనెక్కన రఘునందన్ ను ఊర్లల్లో తిరగనీయద్దు అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement