ద్రవ్యోల్బణం ప్రభావం, వడ్డీ రేట్ల పెంపు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఆర్ధిక మాంద్యం భయాలు, చైనాలో కరోనా కేసులు ఇలా 2022లో స్టాక్మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాలు అనేకం ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు గురయ్యాయి. తీవ్రమైన అనిశ్చిత పరిస్థితులు స్టాక్ మార్కెట్ల లో నెలకొన్నాయి. దీని వల్ల మదుపరులు భారీ స్థాయిలో నష్టపోయారు. ఈ ఆటుపోటులన్నీ తట్టుకుని మన స్టాక్మార్కెట్లు నిలబడ్డాయి. ఇన్వెస్టర్లు లాభాలు పంచాయి. ఈ విషయంలో బ్రెజిల్ స్టాక్ మార్కెట్ అగ్రస్థానంలో నిలిచింది. మన దేశ మార్కెట్లు రెండో స్థానంలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2022లో చాలా పరిణామాలు స్టాక్మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీని వల్ల అమెరికా, యూరప్, చైనా, హాంకాంగ్, తైవాన్, సౌత్ కొరియా, రష్యా వంటి అన్ని ప్రధాన మైన మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.
అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగానే కదలాడే మన సూచీలు కూడా ఒడుదుడుకులకు లోనవుతూనే ఇన్వెస్టర్లు మాత్రం లాభాలు తెచ్చిపెట్టాయి. 2022లో మొత్తంగా సెన్సెక్స్ 2,586.92 పాయింట్లు ( 4.44శాతం), నిఫ్టీ 751.25 పాయింట్లు (4.32శాతం) లాభపడ్డాయి. ఈ విషయంలో బ్రెజిట్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు 4.69 శాతం రాబడి అందించి అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా మార్కెట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే మన మార్కెట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. జకర్తా కాంపోసిట్ ఇండెక్స్ , స్ర్ై టైమ్స్ 4.09 శాతం లాభాలు అందించింది.
16.38 లక్షల కోట్ల పెరుగుదల
మన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 2022లో 16.38 లక్షల కోట్లు పెరిగింది. దీంతో వీటి విలు 282.38 లక్షల కోట్లకు చేరింది. స్థానిక కరెన్సీని పరిగణలోకి తీసుకుంటే ఇన్వెస్టర్ల సంపద 6.15 శాతం మేర వృద్ధి చెందింది. డాలర్ విలవ పరంగా చూస్తే 4.58 శాతం క్షీణించింది. ఈ విషయంలో సింగపూర్ స్ట్రైట్ టైమ్స్ 10.13 వాతం, బ్రెజిల్ బొవెస్పా 4.68 శాతం లాభాలు అందించాయి. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లుగా పరిగణించే ఎస్ అండ్ పీ 500, హాంగ్కాండ్, షాంఘై కాంపోసిట్ వంటి మాత్రం నష్టాలను ఎదుర్కొన్నాయి.
2023లో ఎలా ఉంటుంది
మన స్టాక్ మార్కెట్లు వరసగా 7వ సంవత్సరం లాభాలు సాధించాయి. 2020, 2021 సంవత్సరాలతో పోల్చితే 2022లో సాధించిన లాభం తక్కువే. 2023లో పరిస్థితి కొంత అనిశ్చితితోనే ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటం, రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం ఇంకా ముగియకపోవడం, అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్ధిక మాంద్యం భయాలు, వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా కేంద్ర బ్యాంక్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వీటి ప్రభావం మన మార్కెట్లపై ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల మొదటి అర్ధ భాగం మార్కెట్లు ఒడుదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండో అర్ధ భాగంలో పరిస్థితిలో మార్పు రావచ్చని అంచనా వేస్తున్నారు.