Saturday, November 23, 2024

Big story : మ‌రిచిపోలేని మ‌న‌ చ‌రిత్ర.. తరాల చరిత్రకు మూసీనదీ నాగరికత ప్రేరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భూమిపై ప్రతిప్రాణికి జీవం పోసిన నీరు మట్టికి ప్రాణం పోసే గుణాన్ని కూడా ఇచ్చింది. అందుకే నదీలోయ నాగరికతలకు అత్యంత ప్రాధాన్యత లభించింది. మనిషికి నడక,నాగరితకతలు నేర్పిన నదీలోయలు అనేకం ఉన్నప్పటికీ మూసీపరివాహక ప్రాంతానికి చరిత్రప్రాధాన్యత ఉంది. మురికి కూపంగా మారిన మూసీ ఒకప్పుడు నాగరికతకు నిలయంగా ఉండేది. శాతవాహనుల నుంచి ఆసఫ్‌జాహీలవరకు చరిత్రపాఠాలు చెప్పిన మూసీ మురికి ని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు అభివృద్ధి చెందిన ప్రాంతలను అనుసంధానం చేసేందుకు పక్కామాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏ వాస్తురీతులో మూసీనదీ పురాణపూల్‌ నిర్మించారో అదే పద్దతుల్లో మరిన్ని వంతనెలు నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది.

ప్రస్తుతం ఉన్న మూసీ వంతెనలకు వన్నెతగ్గకుండా నూతనంగా వంతెనలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిిద్దంమైంది. ఈ నేపథ్యంలో ప్యారీస్‌ వంతెనలను ప్రతినిధుల బృందం పరిశీలించింది. అయితే ప్యారీస్‌ వాస్తు రీతులతోనే పురాణా పూల్‌ నిర్మించిన చరిత్ర ఉంది.తెలంగాణలో మహానదులు ప్లీస్టోసీస్‌ యుగం నాటివి. ఈ నదులకు సుమారు 26 లక్షల నుంచి 11.700 లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు భూగర్భపరిశోధకులు వెల్లడించారు. ఈ వరుస క్రమంలోనిదే మూసీ నదీ. అనంతగిరిలో పుట్టి వాడపల్లిలో కృష్ణానదీలో కలుస్తున్న మూసీనదీకి చెక్కుచెదరని చరిత్ర ఉంది. మూసీలేని హైదరాబాద్‌ను నేడు ఎలా ఊహించుకోలేక పోతున్నామో వందలాది సంవత్సరాల క్రితం మూసీ పరివాహక ప్రాంతాల్లో వెలిసిన పట్టణాలు, ఆలయాలను కూడా ఊహించుకోలేము.

- Advertisement -

పురావస్తు పరిశోధనల్లో అనేక అంశాలు వెలుగు చూశాయి. తొలి నాళ్లలో గోదావరి తీరప్రాంతంలో బౌద్ధం విరాజిల్లితే అనంతరం కృష్ణానదీ తోపాటు ఉపనదుల తీరాల్లో బౌద్ద విహారాలు విరాజిల్లాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రవహిస్తున్న మూసీ పరివాహకప్రాంతాల్లో బౌద్ధవిహారాలు, ఆనంద్‌ బాగ్‌ పట్టణం ఉండేదని చరిత్ర పరిశోధకులు వెల్లడించారు. మూసీ తీరంలోని చైతన్యపురం ఒకప్పటి రాచనగరంగా విరాజిల్లినట్లు శాసనాలు వెల్లడిస్తున్నాయి. చైతన్యపురి శాసనం మేరకు క్రీ.శ. 385నాటికే విరాజిల్లినట్లు చరిత్ర ఉంది. బ్రహ్మలిపిలోని ఈ శాసనాన్ని కేంద్ర పురావస్తు శాఖ పరిశీలించి అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. ఆనంతరం బౌద్ధం క్రమేణ అంతరించడంతో మూసీ తీరప్రాంతాల్లో హిందూ దేవాలయాలు వేలిశాయి. ఇందులో భాగంగానే చైతన్యపురి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంఉన్నట్లు పురావస్తు శాఖకు ఆధారాలు లభించాయి.

అలాగే మూసీ నదీ నుంచి వాడపల్లి, వాడపల్లి నుంచి కృష్ణా నదీ, కృష్ణ నుంచి జలరవాణా కొనసాగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మూసీ మురుగును శుద్ధిచేసి వాడపల్లి వరకు బోటింగ్‌ చేసే అవకాశాలను కూడా నిపుణులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. విష్ణుకుండినిల అనంతరం దక్షిణ పథాన్ని పాలించిన మొదటి కీర్తి వర్మ,ఆతర్వాత అతని తమ్ముడు మంగళేశుడు క్రీ.శ. 576నుంచి 610 పదివరకు పాలించినప్పుడు మూసీ పరివాహకప్రాంతాల్లో జనావాలుండేవని చరిత్ర కారులు చెపుతున్నారు. క్రీ.శ. 612లొ రెండవ పులకేశి వేయించిన శాసనం మరిన్ని చరిత్రఅంశాలను బలపరిస్తుంది.

కొత్తవంతెనలకు ప్రభుత్వ ప్రణాళిక

మూసీనదిపై కాలగమనంలో ప్రజారవాణావ్యవస్థను తీర్చిదిద్దేందుకు 7వంతెనలనిర్మాణాలు జరిగాయి.పురాణాపూల్‌, డబిల్‌ పురా వంతెన, చాదర్ఘాట్‌, అంబర్‌ పేట్‌, నాగోల్‌, ఉప్పల్‌ కలాన్‌ దగ్గర వంతెనలు నిర్మించి హైదరాబాద్‌ పాత,కొత్తలను కలిపారు. అయితే పురాణాపూల్‌ వంతెన హైదరాబాద్‌ లో కుతుషాహీ రాజులు నిర్మించినతొలి వంతెన.ఈవంతెన ఫ్యారీస్‌ లోని ఫాంట్‌ న్యూఫ్‌ బ్రిడ్జిని పోలిఉంటుంది. వాస్తురీతులు, నిర్మాణ శైలి ఈ వంతెనకు దగ్గరగా ఉంటాయి. 1578లో ఇబ్రహీం కులీకుత్‌ షాహీ ఈవంతెనను నిర్మించారు. భాగమతి, కులీ ప్రేమకథకు ఈ వెంతెనా వారథి అని చరిత్రకారులు చెపుతుంటారు.

ఈ వంతెన 35 అడగుల వెడల్పు, 600 ఫీట్ల పొడవు, 22అర్చీలు, 54 అడుగులఎత్తు ఉంది. 1908 లో వచ్చిన వరదలతో పాటుగా కాలం పెట్టిన పరీక్షలను ఎదుర్కొని నేటికి నిలిచింది. అనంతరం 1591లో కులీకుత్‌ షాహీ మీర్‌ మోమిన్‌ అప్తారి వాస్తు శిల్పి తో చార్మినార్‌ రూపకల్పన చేశారు. అప్పటి నుంచి మూసీ పరివాహకప్రాంతంలో హైదరాబాద్‌ వెలిసింది. కాకతీయ రాజులు కట్టించిన మంగళవరం గోల్కొండగా ముస్తాబు అయింది.

ఈ చరిత్రను ద్విగుణీకృతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్యారీస్‌ వాస్తు రీతులతో నూతన వెంతెనలను నిర్మించాలని ప్రణాళికలను సిద్ధం చేసింది.అఫ్జల్‌ గంజ్‌ దగ్గర పాదాచారుల వంతెన, ఇబ్రహీంబాగ్‌ కళాశాల, సన్‌ సిటీ నుంచి చింతల్‌ మెట్‌, కిస్మత్‌ పురారోడ్డులింకు, చాదర్‌ ఘాట్‌, మాసారాంబాగ్‌, అత్తాపూర్‌,నార్సింగ్‌ ను కలుపుతూ వెంతెనలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. అయితే పారీస్‌ వాస్తు రీతులతో నిర్మించిన పురాణాపూల్‌ వాస్తు పద్ధతులతో ఈ వంతెనలు నిర్మించి తరాలచరిత్ర ఔన్నత్యం కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు త్వరితగతిన ఫలించాలని పలువురు కోరుకుంటున్నారు.

మూసీనదీ చరిత్ర ప్రాచీనమైంది

మూసీనదీపరివాహక ప్రాంతాల్లో తొలి ఆదిమానవునిచరిత్ర, ఇనుపయుగం పనిముట్లు దొరికాయని సుప్రసిద్ధ పురావస్తు పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. చైతన్యపురిప్రాకృత శానం మేరకు చైతన్యపురిక్రీ.శ 385లో పట్టణంగా విరాజిల్లిందని చెప్పారు. పులిమావిడి, కొత్తపేట శాతవాహన,ఇక్ష్వాకులు, కాకతీయుల నాటి నగరాలని చెప్పారు. శాలివాహనులు, విష్ణుకుండినిలు, చాళుక్యులు, కాకతీయుల శాసనాలు లభించాయని తెెలపారు. మూసీ పరివాహక ప్రాంతాలు చరిత్ర యుగంలో పట్టణాలు, బౌద్ధవిహారాలుగా విరాజిల్లిన చరిత్రఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement