న్యూఢిల్లి: లండన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. తన వారం రోజు ల యూకే పర్యటనను ముగించడానికి ముందు తన విమర్శలకు పదునుపెంచారు. మంగళవారం సాయ ంత్రం లండన్‌లోని చాథంహౌస్ థింక్ ట్యాంక్‌లో జరిగిన సంభాషణ సెషన్లో రాహుల్ ప్రసంగించా రు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్న ఆయన, ఈ విషయంలో అమెరికా, యూరప్ జోక్యం చేసుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. మా దేశం నుంచి వ్యాపారం, వాణిజ్యం ద్వారా డబ్బు సంపాదిస్తున్న ఈదేశాలు, ప్రజాస్వామ్య పునరుద్ధర ణను పట్టించుకోవడం లేదు. ఇందుకోసం చేయాల్సి నంత చేయడం లేదు. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా చెప్పుకుంటున్న యూరప్, అమెరికా దేశాలు, భారత్‌లో అణచివేతకు గురవుతున్న ప్రజా స్వామ్యం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా ఈ అంశంపై గొంతెత్తాలని సూచించారు. మాతృదేశంలో ప్రజాస్వామ్య పరి రక్షణ అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీ యుడి విధి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మాతృ దేశ ప్రాథమిక విలువలు, మనం ఎంతగానో ప్రేమించే ప్రజాస్వా మ్యం పరిరక్షణకు గొంతెత్తాలి అని రాహుల్ సూచిం చారు. భారత ప్రజాస్వామ్యానికి చేయాల్సిన మరమ్మ త్తు పనులను చేపట్టేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..
భారత్‌లో తాము శాశ్వతంగా అధికారంలో ఉంటామని బీజేపీ విశ్వసిస్తోందని, అయితే అది ఎప్పటికీ జరగదని రాహుల్ స్పష్టంచేశారు. దేశంలోని అసమ్మతి గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోం ది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే ఎక్కువకాలం కాంగ్రెస్ పార్టీయే అధికారం లో ఉంది. మోడీ ప్రధాని కావడానికి ముందు కూడా మేము పదేళ్లు అధికారంలో ఉన్నాం. అధికారం మా రుతూ ఉంటుంది. కానీ, బీజేపీ మాత్రం తాము శాశ్వ తంగా అధికారంలో ఉంటామని భావిస్తోంది. అలా ఎన్నటికీ జరగదు. అధికారం శాశ్వతం అనే ఆలోచన హాస్యాస్పదం అని రాహుల్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో పాటు విదేశీ మీడియా కూడా భారత ప్రజాస్వా మ్యంలో తీవ్రమైన సమస్య ఉందని ఎలుగెత్తుతోంది. వాస్తవ పరిస్థితుల్ని ప్రకటిస్తున్నాయి. బీజేపీ స్పంది స్తున్న తీరు కూడా అలాగే ఉంది. వారికి చర్చలపై ఆసక్తి లేదు.. ఏం జరుగుతుందో తమకు మాత్రమే తెలుసునని, దేశంలో మరెవరికీ తెలియదని భావి స్తున్నారు. చివరకు నా ఫోన్లో పెగాసస్ స్పైవేర్‌ను చొప్పించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు. కాబట్టి దేశంలో ఏం జరుగు తున్నదో చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తోంది అని రాహుల్ చెప్పారు.
ఆర్ఎస్ఎస్ మరో ముస్లిం బ్రదర్హుడ్..
ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ, మీరు దానిని ర#హస్య సమాజం అని పిలవవచ్చు. ఇది ము స్లిం బ్రదర్#హుడ్ తరహాలో నిర్మించబడింది. అధికా రంలోకి రావడానికి ప్రజాస్వామ్య పోటీని ఉపయో గించుకుంది. ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థనే అణచివేయాలనే ఆలోచనతో ఉంది. మన దేశంలోని వివిధ సంస్థలను స్వాధీనం చేసుకోవడంలో వారు ఎంత విజయం సాధించారనేది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. పత్రికా, న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ఎన్నికల సంఘం అన్ని సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయి. ముప్పులో ఉన్నాయి. అవి ఏదోఒక విధంగా నియం త్రించ బడుతున్నాయి. నేను 2004లో రాజకీయా ల్లోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పోటీ రాజకీయ పార్టీల మధ్య ఉండేది. ఆ తర్వాత దాని స్వభావం పూర్తిగా మారింది. ఇలా అవుతుందని నేను ఆ సమ యంలో ఊహించలేద. దీనంతటికీ కారణం ఆర్ఎస్ ఎస్ అనే ఛాందస, ఫాసిస్టు సంస్థ అని రాహుల్ విమర్శించారు.
పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది..
కేంబ్రిడ్జిలో చైనా చొరబాట్ల గురించి ప్రస్తావిం చిన రాహుల్ గాంధీ, చాథమ్ హౌస్‌లో పాక్ ఉగ్రవా దంపై మాట్లాడారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏమి టంటే, మన చుట్టూ ప్రతి ఒక్కరితో మనం మంచి సం బంధాలు కలిగివుండాలి. కానీ పాకిస్తాన్ మా దేశం లోకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఆ దేశంతో సత్సంబంధాలలు పాకిస్తానీ చర్యలపై ఆధారపడి ఉం టాయి. ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూ స్నేహం చేస్తా మంటే కుదరదు. అది చాలా కష్టం అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఖర్గే సమర్థుడు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. బీజేపీతో పోరాడేందుకు మేమంతా కలిసి పనిచేస్తు న్నాం. ఖర్గే సామర్థ్యాలు, నైపుణ్యంపై నాకు చాలా నమ్మకం ఉంది అని రాహుల్ వివరించారు.