ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ భారత్‌లో ఉందని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ప్రసంగించిన మోడీ, ఈ స్టార్టప్‌లు 12 లక్షల మందికి పైగా ఉపాధికి దోహదపడుతున్నాయని తెలిపారు. దేశం వికసిత్ భారత్- 2047 దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ మహాకుంభ్ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకుని ఉందన్నారు. స్టార్టప్ కంపెనీలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నామని… గత దశాబ్దంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో దేశంలో తనదైన ముద్రవేసుకుందని ప్రధాని మోడీ అన్నారు.
ఈ వృద్ధి మెట్రో నగరాలకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా సామాజిక సంస్కృతిగా విస్తరించిందన్నారు. భారతదేశ స్టార్టప్ ఎకోసిస్టమ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది మెట్రో నగరాలకే పరిమితం కాలేదు, ఒక సామాజిక సంస్కృతిగా మారిందని మోడీ అన్నారు.