Friday, November 22, 2024

మా పిల్లల ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్స్ హ్యాక్ అయ్యాయి: ప్రియాంకా గాంధీ

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సారథ్యంలో తన ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత, యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తన పిల్లల ఇన్ స్టా గ్రామ్ ఖాతాలు కూడా హ్యాకింగ్ కు గురయ్యాయని ఆమె ఆరోపించారు.

ప్రయాగ్ రాజ్ లో ఈ రోజు నారీ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు రాయ్ బరేలీలో మహిళలకోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దేశంలో మహిళాశక్తి చైతన్యంతో మేల్కొందని, ప్రధాని వారిముందు మోకరిల్లక తప్పడం లేదని, యూపీ మహిళలు తమ శక్తి ఏమిటో చాటారని, ఇది తనకు ఆనందం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement