Thursday, November 21, 2024

Research | కొత్త జాతి గబ్బిలం బెంట్​ వింగ్డ్​.. పశ్చిమ కనుమలలో కనుగొన్న ఓయూ శాస్త్రవేత్త

కర్నాటక కొడగు జిల్లా మకుటాలో ఒక భూగర్భగుహ నుండి మినియోపెట్రస్ శ్రీని, శ్రీనిస్ బెంట్ వింగ్డ్ బ్యాట్ అనే కొత్త జాతి గబ్బిలం క‌నుగొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి శ్రీనివాసులు, యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్ మిస్టర్ ఆదిత్య శ్రీనివాసులు ఈ గబ్బిలాన్ని అనేక ఆధారాల ఆధారంగా వివరించారు.

“మేము మకుటాలోని పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాలలోని పెద్ద భూగర్భ గుహ నుండి గబ్బిలాల నమూనాలను సేకరించాము. ఇది చిన్న బెంట్-వింగ్డ్ బ్యాట్‌ అని మేము తాత్కాలికంగా గుర్తించాము. ఈ గబ్బిలం నికోబార్ దీవులు, దక్షిణ భారతదేశం, నేపాల్, ఈశాన్య భారతదేశంలో కనిపిస్తుంది” అని వారు వివరించారు. అండమాన్ గబ్బిలాలపై మా పరిశోధనలో దీవుల్లోని జంతుజాలం భారతదేశంలోని ప్రధాన భూభాగంలో ఉన్న వాటి కంటే జన్యుపరంగా భిన్నంగా ఉందని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement