కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ముఖ్యమంత్రి వైెస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఓటీఎస్‌పై జగన్ సర్కార్‌ను లేఖలో ముద్రగడ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని అడిగారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు.. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు అధికారం ఎక్కడిదని ముద్రగడ ప్రశ్నించారు. ఓటీఎస్ పేరుతో పేదప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ సీఎం జగన్‌ను కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా మీ నిర్ణయం సరికాదని, వారిని ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో ఎప్పుడో పేదవారికిచ్చిన రుణాలను ఇప్పుడు ఓటీఎస్ పేరుతో వసూలు చేయడం ఇప్పటి వరకూ జరగలేదని.. అసలు పేదవారి ఇళ్ళకు ఇచ్చిన అప్పును తప్పని సరిగా కట్టమని ఏ ప్రజాప్రతినిధి కూడా చెప్పిన సందర్భం ఇంతవరకూ రాలేదని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..