మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 4వ విడత పట్టణ ప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా… తొర్రూరు పట్టణ ప్రగతిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సంఘాలకు కోటి 25 లక్షల బ్యాంకు లింకేజ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పట్టణ వీధుల్లో పర్యటించారు. పారిశుద్ధ్యం, మురుగు నీటి కాలువలు, మంచినీటి సరఫరా వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం జరిగిన పట్టణ ప్రగతి సభలో మంత్రి సమీక్షించి, మాట్లాడారు.పట్టణంలో పట్టణ ప్రగతి కింద 4 కోట్లు మంజూరయ్యాయి. 6,110 నల్లా కనెక్షన్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్నది. 445 మందికి కెసిఆర్ కిట్లు అందాయి. తొర్రూరు సమగ్ర అభివృద్ధికి హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ద్వారా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం.పట్టణంలో డిజిటల్ డోర్ నెంబరింగ్ చేస్తున్నాం..పట్టణంలో నెలకు రూ.35.75 లక్షలు 1,470 పెన్షన్లు, ఏడాదికి రూ.కోటి రూపాయలు 1,282 మందికి రైతుబంధు, రూ.80 లక్షలు 16 మందికి రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ రూ.5కోట్లు 513 మందికి ఇస్తున్నాం
..పట్టణంలోని 386 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 365 సంఘాలకు రూ.16.5 కోట్లు బ్యాంకు లింకెజి రుణాలు ఇవ్వగా, స్త్రీ నిధి ద్వారా 320 సంఘాలకు రూ.5.45 కోట్లు ఇవ్వగా, వడ్డీలేని రుణాల కింద 365 సంఘాలకు రూ. 16.5 కోట్లు ఇచ్చాం. 20 కోట్లతో తొర్రూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్, మొక్కల పెంపకం, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, కొత్త రోడ్లు, మోడల్ ఇంటిగ్రేటెడ్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, కోల్డ్ స్టోరేజ్, యతిరాజారావు పార్క్, అదే పార్క్ లో పిల్లల పార్క్ ను ఏర్పాటు చేశాం.మరో 20 కోట్లతో స్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సీసీ రోడ్డు, నగరంలో ప్రధాన రోడ్లను డబుల్ రోడ్డు, దుబ్బ తండ, sc కాలనీలో కూడా స్మశాన వాటికలు నిర్మిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో… మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, కమిషనర్ గుండె బాబు, జెడ్పీటీసీ శ్రీనివాస్, pacs చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, amc చైర్ పర్సన్ పసుమర్తి శాంత, పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ సోమేశ్వర రావు, అన్ని వార్డుల సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షుడు సీతా రాములు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
మన రాష్ట్రంలోలాంటి పథకాలు మరే రాష్ట్రంలో లేవు-మంత్రి ఎర్రబెల్లి
Advertisement
తాజా వార్తలు
Advertisement