హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్‌ను ఉస్మానియా యూనివర్సిటీ అదుబాటులోకి తీసుకురాబోతోంది. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఉస్మానియా యూనివర్శిటీ సంయుక్తంగా ఈ కోర్సును తీసుకొస్తున్నాయి. ఈమేరకు కోర్సును ప్రారంభించడానికి సోమవారం ఒప్పందం చేసుకున్నాయి. ఈకార్యక్రమంలో ఎయిర్ వైస్ మార్షల్ కెఎస్కే సురేష్, కమాండెంట్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, ఎయిర్ కమాండర్ పీఎస్ వడోద్కర్, ఓయూ వీసీ రవీందర్, రిజిస్ట్రార్ పి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..