Saturday, November 23, 2024

ముక్కులో వెంట్రుకలు కట్ చేయవద్దు.. ఎందుకంటే?

అందంగా కనిపించాలని కొంతమంది ముక్కులో వెంట్రుకలు కత్తిరిస్తుంటారు. అయితే ఈ పని అనారోగ్యం పాలు చేస్తుందని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. ముక్కులో వెంట్రుకలు ఉండటం ద్వారా గాలి నుంచి వచ్చే దుమ్ము, ధూళి కణాలను, సూక్ష్మజీవులను ముక్కు ద్వారా శ్వాసనాళంలోకి.. తద్వారా శరీరంలోకి ప్రవేశించకుండా అవి ఆపుతాయని డాక్టర్లు చెప్తున్నారు. ముక్కులో వెంట్రుకలను పీకినప్పుడు వాటి కుదుళ్ళలో ఏర్పడే రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ జరిగి రక్త నాళాల్లోకి ప్రవేశిస్తుందట. దీని ద్వారా రక్తం సరఫరా జరిగే సిరులలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుందట. దీనినే ‘కావర్నస్ సైనస్ థ్రోంబోసిస్’ అని పిలుస్తారు. ఇది మెదడుపై అధిక ఒత్తిడిని తీసుకు రావడం వల్ల కొన్నిసార్లు మరణానికి కూడా దారి తీస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మరికొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం… ముక్కు వెంట్రుకలు మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేస్తాయి. ఈ వెంట్రుకలు గాలిలో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు కారణమయ్యే వ్యాధికారక క్రిముల నుండి రక్షణ కల్పిస్తాయి. శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ముక్కు వెంట్రుకలు అవసరమని వైద్యులు చెప్తున్నారు. ముక్కులో కొన్నిసార్లు మొటిమలు కూడా వస్తాయి. ఇవి కాలుష్యం, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. ముక్కు వెంట్రుకలు తేమతో ఒక ఉచ్చును ఏర్పర్చి ఎలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియాను ఊపిరితిత్తులలోకి రాకుండా చేస్తాయి. అందుకని, ముక్కులోని వెంట్రుకలను కత్తిరించినప్పుడు లేదా వ్యాక్స్ చేసినప్పుడు వైరస్‌, బ్యాక్టీరియా కోసం ఒక క్లీన్ ట్రాక్ సృష్టించబడి అవి ఊపిరితిత్తులకు సులభంగా చేరుతాయి. అందువల్ల ముక్కులో వెంట్రుకలు కత్తిరించవద్దని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: ఈనెల 14 వరకు పలు రైళ్లు రద్దు

Advertisement

తాజా వార్తలు

Advertisement