Friday, November 22, 2024

శాంతి భద్రతల పరిరక్షణకే ‘కార్డెన్ అండ్ సెర్చ్’ .. ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ ..

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో పోలీసులు ఆకస్మికంగా కార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు..21 బైక్ లు,01 ఆటో లు, 01 ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓఎస్డి మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నామ‌న్నారు, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటే కార్డెన్ అండ్ సెర్చ్ లు నిర్వహించడం వలన దొరికిపోతార‌న్నారు.ప్రజలు, మహిళలు ఆపద సమయంలో డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పలు రకాల పుకార్లను నమ్మకూడదని, వాటిలో నిజానిజాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకోవాలి అని చెప్పారు. మహిళాల సమస్యలు తెలుసుకొని మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్న పోలీస్ కి చెప్పవచ్చు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement