Friday, January 24, 2025

Oscars 2025 | ఆస్కార్ నామినేష‌న్స్… లిస్ట్ ఇదే !

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ 97వ అవార్డుల వేడుక మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను అకాడమీ (గురువారం) ప్రకటించింది. మార్చి 2న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు అకాడమీ అధికారులు ప్రకటించారు.

అయితే గతేడాది నామినేషన్ల జాబితా విడుదల కావాల్సి ఉండగా లాస్ ఏంజిల్స్‌లో అగ్నిప్రమాదం కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే, 96వ ఆస్కార్‌లో రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది.

కానీ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో భారతీయ సినిమాలు తీవ్ర నిరాశను చవిచూశాయి. కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్, సంతోష్, స్వాతంత్ర్య వీరా సావర్కర్‌ల సినిమాలు నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మించిన అనూజ అనే షార్ట్ ఫిల్మ్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయింది.

ఏయే కేటగిరీలో ఏయే సినిమాలు నామినేట్ అయ్యాయో పరిశీలిస్తే..

- Advertisement -

ఉత్తమ చిత్రం :

  • అనోరా
  • ది బ్రూటలిస్ట్
  • ఎ కంప్లీట్ అన్ నోన్
  • కాన్క్లేవ్
  • డూన్: పార్ట్ టూ
  • ఎమిలియా పెరెజ్
  • ఐ యామ్ స్టిల్ హియర్
  • నికెల్ బాయ్స్
  • ది సబ్‌స్టెన్స్
  • వికెడ్

ఉత్తమ దర్శకుడు

  • జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్)
  • సీన్ బేకర్ (అనోరా)
  • బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్)
  • కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టెన్స్)
  • జేమ్స్ మాంగోల్డ్ (ఎ కంప్లీట్ అన్ నోన్)

ఉత్తమ నటుడు :

  • అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
  • టిమోతీ చలమెట్ (ఎ కంప్లీట్ అన్ నోన్)
  • కోల్మన్ డొమింగో (సింగ్ సింగ్)
  • రాల్ఫ్ ఫియన్నెస్ (కాన్క్లేవ్)
  • సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)

ఉత్తమ నటి :

  • సింథియా ఎరివో (వికెడ్)
  • కార్లా సోఫియా గాస్కాన్ (ఎమిలియా పెరెజ్)
  • మైకీ మాడిసన్ (అనోరా)
  • డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)
  • ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)

ఉత్తమ సహాయ నటుడు :

  • యురా బోరిసోవ్ (అనోరా)
  • కీరాన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్)
  • ఎడ్వర్డ్ నార్టన్ (ఎ కంప్లీట్ అన్‌నోన్)
  • గై పియర్స్ (ది బ్రూటలిస్ట్)
  • జెరెమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్)

ఉత్తమ సహాయ నటి :

  • మోనికా బార్బారో (ఎ కంప్లీట్ అన్‌నోన్)
  • అరియానా గ్రాండే (వికెడ్)
  • ఫెలిసిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్)
  • ఇసాబెల్లా రోసెల్లిని (కాన్‌క్లేవ్)
  • జో సాల్డానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే :

  • అనోరా
  • ది బ్రూటలిస్ట్
  • ఎ రియల్ పెయిన్
  • సెప్టెంబర్ 5
  • ది సబ్‌స్టాన్స్

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే :

  • కాంక్లేవ్
  • ఎ కంప్లీట్ అన్‌నోన్
  • ఎమిలియా పెరెజ్
  • నికెల్ బాయ్స్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ :

  • ఫ్లో
  • ఇన్‌సైడ్ అవుట్ 2
  • మెమోయిర్ ఆఫ్ ఎ స్నేల్
  • వాలెస్ అండ్ గ్రోమిట్: వెంజియన్స్ మోస్ట్ ఫౌల్
  • ది వైల్డ్ రోబోట్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ :

  • ది బ్రూటలిస్ట్
  • కాంక్లేవ్
  • డూన్: పార్ట్ టూ
  • వికెడ్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ :

  • ఎ కంప్లీట్ అన్ నోన్
  • కాంక్లేవ్
  • గ్లాడియేటర్ II
  • నోస్ఫెరాటు
  • వికెడ్

ఉత్తమ సినిమాటోగ్రఫీ :

  • ది బ్రూటలిస్ట్
  • డూన్: పార్ట్ టూ
  • ఎమిలియా పెరెజ్
  • మరియా
  • నోస్ఫెరాటు

ఉత్తమ ఎడిటింగ్ :

  • అనోరా
  • ది బ్రూటలిస్ట్
  • కాంక్లేవ్
  • ఎమిలియా పెరెజ్
  • వికెడ్

ఉత్తమ సౌండ్ :

  • పూర్తిగా తెలియనిది
  • డూన్: రెండవ భాగం
  • ఎమిలియా పెరెజ్
  • వికెడ్
  • ది వైల్డ్ రోబోట్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ :

  • ఏలియన్: రోములస్
  • బెటర్ మ్యాన్
  • డ్యూన్: రెండవ భాగం
  • కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్
  • వికెడ్

ఉత్తమ ఒరిజినల్ స్కోర్ :

  • ది బ్రూటలిస్ట్
  • కాన్క్లేవ్
  • ఎమిలియా పెరెజ్
  • వికెడ్
  • ది వైల్డ్ రోబోట్

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ :

  • ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
  • ది జర్నీ (ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్)
  • లైక్ ఎ బర్డ్ (సింగ్ సింగ్)
  • మి కామినో (ఎమిలియా పెరెజ్)
  • నెవర్ టూ లేట్ (ఎల్టన్ జాన్: నెవర్ టూ లేట్)

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ :

  • ఐ యామ్ స్టిల్ హియర్ (బ్రెజిల్)
  • ది గర్ల్ విత్ ది సూది (డెన్మార్క్)
  • ఎమిలియా పెరెజ్ (ఫ్రాన్స్)
  • ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్ (జర్మనీ)
  • ఫ్లో (లాట్వియా)
Advertisement

తాజా వార్తలు

Advertisement