Tuesday, November 26, 2024

ఐటీ రంగంలో దూసుకెళ్తున్న ఓరుగల్లు : విప్ దాస్యం వినయ్ భాస్కర్

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో వరంగల్ లో త్వరలో ప్రముఖ ఐటీ సంస్థ ఎల్.టీఐ మైండ్ ట్రీ ఆఫీస్ ప్రారంభం కానుంద‌ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఎల్ఐటీ మైండ్ ట్రీ ఆఫీస్‌ ప్రారంభించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి సంస్థ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గొల్లపూడి ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, ఐటీ,పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తరువాత ఓరుగల్లు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ విస్తరణకు విశేష కృషి చేస్తున్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఇప్పటికే ఓరుగల్లు నగరంలో ప్రముఖ ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని ఇప్పుడు ఎల్.టీ.ఐ మైండ్ ట్రీ కంపెనీ రాకతో ఓరుగల్లు నగరం ఐటీ రంగంలో మరింత పురాగభివృద్ధిని సాధిస్తుందని, అందుకు విశేషమైన కృషి చేస్తున్న కేటీఆర్ కు ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement