ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు. కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘బిగ్‌బా స్’ ఫేం సోహెల్, మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తు న్నారు. మార్చిలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి పలు విశేషాలను యూనిట్ మీడియాతో పంచుకుంది.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గత 46 సంవత్సరాలుగా కొనసాగటానికి నేను నమ్ముకున్న కామెడీనే. ఇటీ-వలే వాల్తేర్ వీరయ్య వంటి హిట్ ఇచ్చారు. మాయలోడు, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’తో నా కామెడీకి బ్రాండ్‌ను క్రియేట్ కావడంలో ముఖ్యపాత్ర వహించిన వారిలో ముఖ్యులు ఎస్.వి. కృష్ణారెడ్డి గారు. సాక్షాత్తూ నాటి ప్రధాని పీవీ నరసింహారావు గారు దిస్ బాయ్ ఈజ్ స్ట్రెస్ రిలీజర్ అన్నా రంటే ఎంత గొప్ప విషయం. ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమాలు చేసిన మేము. ఈ సినిమాను కూడా అంతే సంస్కారవంతంమైన కేటగిరీ సినిమాగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అన్నారు.
దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ”వినోదం తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ సినిమా ఇది. నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఎంటర్-టె-న్‌మెంట్‌కు, మంచి డైలాగ్స్‌కు స్కోప్ ఉన్న కథ ఇది. మీకు నచ్చే అన్ని అంశాలనూ పుష్కలంగా ఏర్చి కూర్చిన సినిమా ఇది. అన్నారు.
నటి మీనా మాట్లాడుతూ ” ఈ కథ చెపుతున్నప్పుడే డైరెక్టర్ గారు నాకు ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది.. ఎలా బిహేవ్ చేస్తుంది అని ప్రాక్టికల్‌గా కూడా చూపించారు. అన్నారు.
హీరో సోహైల్ మాట్లాడుతూ…. ఈ సినిమాలో నటిం చడం నా అదృష్టంగా భావిస్తాను. కృష్ణారెడ్డి గారి సిని మాలు, రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూసి పెరిగినోళ్లం. అన్నారు. ఈ చిత్ర సమర్పకుడు కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ… సినిమా బాగా వచ్చింది. మార్చిలో విడుదల చేయటానికి నిర్మాత కల్ప న గారు ఏర్పాట్లు- చేస్తున్నారు. అందరూ చెప్పి నట్లు- ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్-టె-నర్. కృష్ణారెడ్డిగారి గత చిత్రాల్లోని మ్యాజిక్‌తో పాటు- మంచి మెసేజ్ ఉన్న స్క్రిప్ట్ ఇది. అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటి హేమ కూడా మాట్లా డారు. ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్ర సాద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.