Thursday, November 21, 2024

రీ సర్వేలో స్పీడ్‌ పెంచాలంటూ ఆదేశాలు జారీ చేసిన : సీఎం జగన్..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూముల సమగ్ర రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేతో అ న్నిరకాల భూ వివాదాలు పరిష్కార మవుతాయన్నారు. దశాబ్దాల కాలంగా నెలకొన్న సమస్యలకు పరిష్కాం లభించగలదనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జగనన్న శాశ్వత భూ హక్కు.. భూ రక్ష సమగ్ర రీ సర్వేపై రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఉన్నతాధికారులతో కలసి సమీక్షించారు. భూ వివాదాల పరిష్కారం సమగ్ర రీ సర్వే ప్రధాన లక్ష్యమన్నారు. నిర్దేశిత గడువులోగా సర్వే పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణం గా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, సర్వే రాళ్ల దిగుమతి తదితర అంశాల్లో స్పీడ్‌ పెంచాలన్నారు. సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. నూరేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, ఈ సర్వే పూర్తి చేయటం ద్వారా ప్రజలు, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అటవీ,పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్‌ కల్లాం, భూ పరిపాలన విభాగం చీఫ్‌ కమిషనర్‌ జీ సాయి ప్రసాద్‌, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ తదితరులు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement