Friday, October 18, 2024

TG | ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ !

ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్ మున్సిపాలిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వ ఆర్థిక సాయం అందించనున్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై అవగాహన, సోషల్ ఆడిట్, అధికారులతో సంప్రదింపులులాంటి కార్యక్రమాలను ఇందిరమ్మ కమిటీలు చేపట్ట‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement