Saturday, November 23, 2024

AP | అర్చకుల జీవితాల్లో వెలుగులు… వేతనాల పెంచుతూ ఉత్తర్వులు

అమరావతి, ఆంధ్రప్రభ: : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా అర్చకులు వేతనాలు పెంచుతూ ఇటీ-వల ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకుల సంక్షేమంపై ప్రత్యేక పోకస్‌ పెట్టారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అర్చకుల వేతనాల పెంపు, ఆలయాల జీర్ణోద్ధరాణ.. వంశపారంపర్యం అర్చకత్వం కొనసాగింపుతో పాటు వంశపారంపర్య ఆలయాల అప్పగింత వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గత కొంతకాలంగా అర్చకుల వేతనాల పెంపులో నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ఇటీ-వల అర్చకులు వేతనాలు పెంపుపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై అర్చకులు వేతనాలు కనీసంగా రూ 16,500 ఉండబోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం నేరుగా లబ్ధిదారునికి అందేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అర్చకుల వేతనాలపై కూడా సీఎం జగన్మోహన్‌ రెడ్డి సమీక్షించి పెంపుకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలు నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

వేతనాలు పెంపు..

ప్రతిపక్ష నేతగా ప్రజాసంకల్పయాత్ర నిర్వహించిన వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్చకుల దుర్భర పరిస్థితి పై దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో అర్చకులు చెప్పిన ప్రతి అంశాన్ని సమీక్షిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇటీ-వల అర్చకుల వేతనాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం నిర్ణయం మేరకు ప్రముఖ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల కనీస వేతనం రూ 16,500 ఉండేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధమైన వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రతి ప్రాధానాలయంలో రూ.8000 నుండి రూ.10000 మధ్యన అర్చకుల వేతనాలు ఉన్నాయి. వీటిపై ఇటీవల సమీక్ష సందర్భంగా ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా వేతనాల పెంపుపై దేవదాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఉన్నతాధికారులు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న మూడు వేల మందికి పైగా అర్చకులకు లబ్ధి చేకూరానుంది.

డీడీఎన్‌ఎస్‌ అమలు..

రాష్ట్రంలోని ఆలయాల జీర్నోద్ధరణ పై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గత నాలుగేళ్లుగా ధూప దీప నైవేధ్యాలకు నోచుకోని ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతంలోని అనేక ఆలయాల్లో రోజువారి నిర్వహించాల్సిన ధూపదీప నైవేద్యాలకు సైతం నిధులు లేని పరిస్థితి.

గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 6వేలకు పైగా ఆలయాలకు బీడీఎన్‌ఎస్‌ స్కీములు అమలు చేస్తుంది ఇందులో భాగంగా ప్రతి నెల ఆ యా ఆలయాలకు రూ.. 5వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో రూ రెండు వేలు ధూపదీప నైవేధ్యాల కోసం వెచ్చించాల్సి ఉండగా మిగిలిన 3000 అర్చకులకు వేతనంగా ఇవ్వాల్సి ఉంటు-ంది.

ఆలయాల నిర్వహణ బాధ్యత..

రాష్ట్రంలోని రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల నిర్వహణ బాధ్యతలు వంశపారంపర్య ధర్మకర్తలు, అర్చకులకు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీ-వల కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అర్చకులు సంబంధించి వంశపారంపర్య ధర్మకర్తలు ఉన్న పక్షంలో వెంటనే వాళ్లకు ఆలయాలను స్వాధీనం చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది అర్చకులు తమ పూర్వీకుల ఆలయాలను నిర్వహించేందుకు ముందుకొచ్చి దేవదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు- తెలిసింది. తొందరలోనే దరఖాస్తులన్నిటిని సమగ్ర అధ్యయనం చేసి ఆయా ఆలయాలు నిర్వహణ బాధ్యతలు అర్చకులకే అప్పగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement