బెంగళూరు: బాథిత మహిళ కావాలనే నిందితుడితో నగ్నంగా వీడియో కాల్స్ చేసి మాట్లాడిందని, పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం ఏర్పరచుకున్నారని దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఓ రేప్ కేసులో నిందితుడికి కర్నాటక హైకోర్టు షరరతులతో బెయిల్ మంజూరు చేసింది. నిందితుడికి జీవిత ఖైదు విధించేంత అభియోగాలు ఏమీ లేవు. అంతేకాదు, నిందితుడికి నేరచరిత్ర కూడాలేదు. బాధితురాలి నగ్నచిత్రాలు సర్క్యులేట్ చేసినందుకు అతనిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద నిందతుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించవచ్చు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నిందితుడికి బెయిల్ మంజూరైత బాధితురాలికి ప్రాణాహాని ఉందనే ఆరోపణలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధితురాలు శారీరక సంబంధానికి అంగీకారం తెలిపి, మొబైల్‌లో తన ప్రయివేటు శరీరభాగాలను చూపించిన పరిస్థితుల్లో ఆమెకు ప్రాణహాని ఉంటుందా? లఏదా? అనే విషయాన్ని దిగువ కోర్టులు నిర్ణయించాలని సూచించింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ బంధువులే… ఒకే గ్రామానికి చెందిన వారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్‌లో ఏప్రిల్ 6న పోలీసు కేసు నమోదైంది.