రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చరణ్ కరీర్ లోని ఒక హిట్ సినిమాను రీ-రిలీజ్ కి డిమాండ్ చేశారు అభిమానులు. అందులోనూ చాలా మంది అయితే ఆరెంజ్ మూవీ రీ-రిలీజ్ చేయమని నిర్మాత నాగబాబుకు ట్వీట్స్ ద్వారా తెలిపారు. ఆరెంజ్ సినిమాలోని సాంగ్స్ అన్నీ చార్ట్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ, ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ టైమ్ లో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అందుకే ఈ మూవీ రీ-రిలీజ్ చేయాలనే నిర్ణయం మొదట్లో సందేహాస్పదంగా ఉంది మేకర్స్ కి. కాగా, రామ్ చరణ్ కరీర్ లో ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాలు ఉన్నాయి.. వాటిలో ఒక సినిమా రిలీజ్ చేయడం మంచిదని భావించారు.
అయితే, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ఆరెంజ్ మూవీ రీ-రిలీజ్ థియేటర్లలో దుమ్ము దులిపేస్తుంది. ఆరెంజ్ మూవీ గరిష్ట ప్రాంతాలలో భారీ ఆక్యుపెన్సీలను నమోదు చేకుంది. చాలా షోలు హౌస్‌ఫుల్‌గా మారాయి. రీ-రిలీజ్‌ని మూవీ టీమ్ చాలా బాగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది. మొదట, లిమిటెడ్ స్క్రీన్స్ లో షోలను ప్రారంభించారు, అయింతే ఆరేంజ్ సినిమాకి ఓరేంజ్ డిమాండ్ రావడంతో, థియటర్లలో షోలను మరింత పెంచారు మేకర్స్. థియటర్లలో ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా లేదు, దీనికి సంభందించిన కోన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రామ్‌చరణ్, జెనీలియా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ తెరకెక్కింది. నాగ బాబు నిర్మించిన ఈ సినిమా మగధీర ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ తదుపరి విడుదల కావడంతో భారీ అంచనాల మధ్య 2010లో విడుదలైంది. వివిధ కారణాల వల్ల, ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడంలో విఫలమైంది. కానీ, సినిమాలోని మ్యూజిక్, సాంగ్స్ చార్ట్‌బస్టర్‌గా మారాయి. అవి నేటికీ చాలా మందికి ఇష్టమైన ఆల్బమ్‌లలో ఒకటిగి మిగిలిపోయాయి అనే చెప్పవచ్చు.