ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఇవ్వాల (సోమవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అక్కడ ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు. కాలినడకన వెళ్లే భక్తులను నిలిపివేశారు. భక్తులంతా హోటళ్లకు వెళ్లాలంటూ అభ్యర్థిస్తున్నామని రుద్రప్రయాగ్ సీవో ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం వాతావరణం సరిగా లేదని, భక్తులెవ్వరూ కేదార్‌నాథ్‌కు కాలినడకన వెళ్లరాదు అని, సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. మంగళవారం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ప్రమోద్ వెల్లడించారు. గుప్తకాశీ నుంచి వస్తున్న 5 వేల మందిని ప్రస్తుతం నిలిపివేసినట్లు చెప్పారు. హెలికాప్టర్ సర్వీసులను కూడా నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement