Friday, November 22, 2024

ఉద్యోగులను తొలగించనున్న ఒరాకిల్‌..

టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ఒరాకిల్‌ ఉద్యోగుల సంఖ్యను కుదించాలని నిర్ణయించింది. ఎంత మంది ఉద్యోగులను తొలగించనుందో సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. ఒరాకిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా లక్షా 43 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక బిలియన్‌ డాలర్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలని ఒరాకిల్‌ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తామని తెలిపింది. అమెరికాతో పాటు కెనడా, భారత్‌, యూరోప్‌లో ఉన్న కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా తొలగింపులో ఉంటారని స్పష్టం చేసింది.

అమెరికాలో ఆర్థిక మాంధ్యం వస్తుందన్న అంచనాలతో అనేక బడా కంపెనీలు ఉద్యోగులను తొలగించే కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌ లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకించింది. ఇదే బాటలో మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌ , యాపిల్‌ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించాయి. త్వరలోనే ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించేది ఈ కంపెనీలు కూడా ప్రకటించనున్నాయని రాయిటర్స్‌ వార్త సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement