కొత్త స్మార్ట్ ఫోన్లలో తయారీదారులు ముందుగానే కొన్ని యాప్స్‌ను పెట్టి మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు. ఈ ఫ్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ తప్పనిరిగా మన ఫోన్లలో ఉంటాయి. వీటిని తొలగించే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకు రానున్న కొత్త భద్రతా ప్రమాణాల మార్గదర్శకాల్లో ఈ యాప్స్‌ను ప్రస్తావించింది. ఇలా ముందుగానే ఫోన్లతో పాటే వస్తున్న యాప్స్‌ను తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని తయారీ కంపెనీలను కేంద్రం కోరనుంది. ఈ విషయంలో కంపెనీలు తప్పనిసరిగా పాటించేలా నిబంధనలు తీసుకురానుందని దీంతో సంబంధం ఉన్న వారు తెలిపారని రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో పాటు ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్డేట్లను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడానికి అనుమతించమని స్మార్ట్ ఫోన్ తయారీదారులను ఆదేశించనుంది.
మన దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సెల్‌ఫోన్ మార్కెట్ గా ఉంది. ఇలా ఫ్రీ ఇన్స్టాల్ చేసిన యాప్స్‌ను తొలగించేందుకు వీలు కల్పిస్తే, సెల్‌ఫోన్ తయారీ కంపెనీలకు ఆర్ధికంగా నష్టం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మన దేశంలో ప్రధానంగా శామ్సంగ్, షావోమి, వివో, ఓప్పో, యాపిల్ వంటి కంపెనీలు ఫోన్లను తయారు చేసి మార్కెట్ చేస్తున్నాయి. ప్రధానంగా వినియోగదారుల డేటా దుర్వినియోగం, యాప్‌ల మాటున గూఢచర్యం జరుగుతుందన్న ఆందోళనల మధ్య కేంద్ర ఐటీ శాఖ కొత్త నిబంధనలు తీసుకు వచ్చేందుకు నిర్ణయించిందని ఒక ఉన్నతాధికారి వె ల్లడించారు. స్మార్ట్ ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ చేసిన యాప్స్ మూలంగా భద్రతకు భరోసా లేదని, కేంద్రం చైనాతో సహా దేశాన్ని ఇలా గూఢచర్యం చేసేందుకు, డేటాను దురి ్వనియోగం చేసేందుక అనుమతించబోదని ఆ అధికారి స్పష్టం చేశారు.
ప్రభుత్వం 2020లో భద్రత కారణాలతోనే ప్రభుత్వం 300 చైనాకు చెందిన యాప్‌లను నిషేధించింది. మన దేశంలో అమ్ముతున్న స్మార్ట్ ఫోన్లలో చాలా వరకు ముందుగానే ఇన్స్టాల్ చేసిన యాప్స్‌తోనే వస్తున్నాయి. ఇవి భద్రత పరమైన సమస్యలకు కారణంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనిపై ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించినట్లు ఆ అధికారి తెలిపారు. ఇండియా స్మార్ట్ మార్కెట్లో 50 శాతానికిపైగా వాటాను చైనా కంపెనీలు కలిగి ఉన్నాయి. శామ్సంగ్కు 20 శాతం మార్కెట్ వాటా ఉంది. యాపిల్ ఐఫోన్‌కు 3 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌లో ముందుగానే ఇన్స్టాల్ చేసిన యాప్స్‌ను తొలగించాలన్న నిబంధన ఉంది.
మన దేశం ప్రతిపాదిస్తున్న స్క్రీనింగ్ చేసే యంత్రాంగం మాత్రం లేదు. స్మార్ట్ తయారీ కంపనీలు ఆయా కంపెనీలతో బిజినెస్ ఒప్పందాలు చేసుకుని ఫోన్లలో ముందుగానే యాప్స్‌ను లోడ్ చేసి మార్కెట్ చేస్తున్నాయి. మన దేశం రూపొందిస్తున్న కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తరువాత ముందుగా ఇన్స్టాల్ చేసిన యాప్స్‌ను తొలగించే వీలు కలగుతుంది. నిబంధనలు పాటిస్తున్నాయో లేదో తనిఖీలను కూడా ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. వీటిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ్స చూస్తుంది. దీంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆప్డేట్ను అందించే ముందే ఈ తనిఖీ తప్పనిసరి చేయనుంది. కస్టమర్లు తమకు ఇష్టమైన యాప్స్‌ను కొనసాగించుకోవచ్చు.