Monday, December 23, 2024

TG | ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాల రాద్దాంతం : టీపీసీసీ చీఫ్‌

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్ర ప్రభ) : తొక్కిసలాటలో ఒక నిరుపేద మహిళ చనిపోతే లేని బాధ… సినిమా రంగంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఎందుకంత ప్రేమ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం వివరణ సమంజసమేనని అన్నారు.

ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… సినీ పరిశ్రమపై మాకు కూడా ప్రేమ ఉంది.. కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

తొక్కి సలాటలో ఓ మహిళ చనిపోయి ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఉంటే దానిపై బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సినీ వర్గం నుంచి చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. సినీ పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాదు రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.

పద్మాలయ, రామానాయుడు స్టూడియోలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి చిత్ర పరిశ్రమను ప్రోత్సహించిందన్నారు. మాకు ఏ వ్యక్తులపై ద్వేషాలు ఉండవు.. ప్రభుత్వానికి అంత సమానమేనని అన్నారు. తొక్కి సలాటలో మహిళా చనిపోయిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే లేనిపోని ఆరో పణలు చేయడంపై మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement