Friday, November 22, 2024

బెంగుళూరులో 13, 14 న ప్రతిపక్ష పార్టీల నేతల భేటీ

న్యూఢిల్లీ :ప్రతిపక్ష పార్టీల నేతల తదుపరి సమావేశం జూలై 13, 14 తేదీల్లో బెంగళూర్‌ లో నిర్వహించన్నుట్లు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ వెల్లడించారు. ”పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం తరువాత ప్రధాని మోడీకి కంటిమీద కునుకులేకుండా పోయిందని” ఆయన అన్నారు. ఈ నెల 23న బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నివాసంలో సమావేశమైన 15 ప్రతిపక్ష పార్టీల నేతలు జూలై 10-12 తేదీల్లో సిమ్లాలో సమావేశం కానున్నట్టు వెల్లడించారు. అయితే, ఆ సమావేశ స్థలి, సమయాల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని పవార్‌ తెలిపారు. 2024 ఎన్నికల్లో బిజెపిపై ఐక్యంగా పోరాడేందుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి బెంగళూరు సమావేశంలో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పాట్నా సమావేశం ఒక మంచి పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత దేశ లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని, పౌర స్వేచ్ఛ, ప్రాథóమిక హక్కులకు మన రాజ్యాంగం ఇస్తున్న హామీలను కాపాడుకోడానికి ప్రతిపక్ష పార్టీల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించే కీలకాంశాలపై అఖిల భారత స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ సంయుక్తంగా ప్రచారాలు నిర్వహించాలని, వేగంగా క్షీణిస్తున్న ప్రజల జీవనోపాధి అంశాలపై ఉమ్మడిగా నిరసన కార్యాచరణలు చేపట్టాలని సిపిఎం ఆ సమావేశంలో ప్రతిపాదించింది.ప్రతిపక్షాల ఓట్లలో చీలిక నుండి బిజెపి లబ్ధి పొందేందుకు ఏమాత్రం అవకాశమివ్వరాదని, ఇందుకు రాష్ట్రాల స్థాయిలో ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరగాలని కూడా సిపిఎం సూచించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement