Tuesday, November 26, 2024

రాహుల్ గాంధీపై వేటుతో ఏక‌మైన విప‌క్షాలు…

హైద‌రాబాద్ – ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్దారిస్తూ సూర‌త్ కోర్టు ఇచ్చిన తీర్పు పై 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే లోక్ స‌భ స‌భ్య‌త్వంపై అన‌ర్హ‌త వేటు వేసింది కేంద్ర ప్ర‌భుత్వం.. ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకున్నామంటూ లోక్ స‌భ కార్య‌ద‌ర్శి ఒక ప్ర‌క‌ట‌న చేశారు.. ఈ చ‌ర్య‌పై విప‌క్షాలు భ‌గ్గు మంట‌న్నాయి.. కాంగ్రెస్ ను దూరంగా ఉంచే పార్టీలు సైతం ఇప్పుడు ఆయ‌న‌కు సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నాయి.. ప్ర‌జాస్వామ్యానికి ఇది చీక‌టి రోజ‌ని బిఎర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కెసిఆర్ వ్యాఖ్యానించారు.. ఇక రాహుల్ అంటే మండిప‌డే తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీ సైతం రాహుల్ పై వేటు బిజెపి నియంతృత్వ ధొర‌ణికి నిద‌ర్శ‌న‌మంటూ మండి ప‌డ్డారు..


వామ ప‌క్షాలు ఈ చ‌ర్య‌ను ముక్త కంఠంతో ఖండిచాయి.. డిఎంకె అధినేత స్టాలిన్ ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేస్తూ, ఒక చిన్న మాట‌కే అంత పెద్ద శిక్ష విధించ‌డం బిజెపి అధిప‌త్య పోక‌డే నంటూ త‌ప్పు ప‌ట్టారు.. రాహుల్ త‌మ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్న‌దంటూ పేర్కొన్నారు.. ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసి ఈ చ‌ర్య‌ను త‌ప్పుప‌ట్టారు.. విప‌క్షాల గొంతును ఇంట‌, బ‌య‌ట కూడా వినిపించ‌కుండా చేయ‌డమే బిజెపి ల‌క్ష్యంగా మారింద‌న్నారు..
లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీని అనర్హత వేటు వేయడం విస్మయం కలిగిస్తోందని ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. యావత్‌ దేశాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. అహంకారంతో వ్యవహరిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ, ప్రధాని మోడీ నవ భారతంలో.. భాజపా ప్రధాన టార్గెట్‌ ప్రతిపక్ష నేతలే. నేర చరిత్ర కలిగిన భాజపా నేతలకు కేబినెట్‌ పదవులిస్తూ.. ప్రతిపక్ష నేతలను వారి ప్రసంగాల కారణంగా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. మన ప్రజాస్వామ్యం నేడు మరింత పతనమవడాన్ని మనం చూస్తున్నాం అంటూ రాహుల్ పై చ‌ర్య‌ను ఖండించారు..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , శివ‌సేన ఠాక్రే వ‌ర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే రాహుల్ పై అన‌ర్హ‌త వేటును ఖండిస్తూ,
‘ఇది ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. అన్ని సంస్థలు కేంద్రం ఒత్తిడితో పనిచేస్తున్నాయి. దేశాన్ని దోచుకుంటున్న దొంగను దొంగ అని పిలవడం కూడా నేరమైంది. నియంతృత్వ పాలనకు ముగింపు పలికే సమయం ఆరంభమైంది. ఈ పోరాటానికి ఇప్పుడు ఓ దిశ అవసరం అంటూ వ్యాఖ్యానించారు.
అలాగే ఆర్జెడీ, స‌మాజ్ వాదీ, జ‌న‌తాద‌ళ్ యు, పిడిఎఫ్, పార్టీలు కూడా రాహుల్ పై అనర్ష‌త వేటు వేయ‌డాన్ని ఖండించాయి..
రాహుల్ గాంధీపై వేటు – అప్ర‌జాస్వామిక‌మ‌న్న కెటిఆర్
కాంగెస్ పార్టీ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీపై ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం కింద అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని బిఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్ త‌ప్పుప‌ట్టారు.. . ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల నియ‌తృత్వం దొర‌ణికి ఈ చ‌ర్య నిద‌ర్శ‌న‌మ‌న్నారు.. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎవ‌రు గ‌ళ‌మెత్తినా వాళ్ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఈడీ,సిబిఐ, ఐటి దాడులు చేయించ‌డం, వారిని వేధించ‌డం బిజెపి ప్ర‌భుత్వానికి అల‌వాటుగా మారింద‌న్నారు.. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ శిక్ష‌పై 30 రోజులు స్టే ఉన్న‌ప్ప‌టికీ ఎంపి ప‌ద‌విపై అన‌ర్హ‌త వేటు వేయ‌డం క‌క్ష‌సాధింపు చ‌ర్యేన‌ని కెటిఆర్ వ్యాఖ్యానించారు..
ప్రతి చిన్న అంశానికీ అనర్హతను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం క్రమంగా క్షీణించిపోతుందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. పదవి కోల్పోయిన వ్యక్తిగా రాహుల్ కు పైకోర్టులో అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు ఉందన్న ఆయన.. ఒక వేళ పై కోర్టులో శిక్షను తగ్గించినట్లయితే అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement