Tuesday, November 26, 2024

కాక పుట్టిస్తున్న పెగాసస్.. హోంమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్

పెగాసస్ అంశంపై పార్లమెంట్ అట్టుడికిపోతోంది. పెగాసస్ అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్, డీఎంకే పార్టీల ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టారు. టెర్రరిస్టులపై దాడి చేసేందుకు ఇజ్రాయిల్ పెగాసస్ అనే ఆయుధాన్ని తయారుచేసుకుందని.. కానీ ప్రధాని మోదీ, షా దాన్ని భారతీయులు, భారత సంస్థలపై ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాగా 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనతోనే ఈ పెగాసస్ స్కాండల్‌ ఆరంభమైందని కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసే ప్రక్రియ 2017 నాటి మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ప్రారంభమైందని ధ్వజమెత్తారు. ఈ స్కాండల్‌పై పూర్తి వివరాలు ఇంకో 15 రోజుల్లో వెలుగులోకి వస్తాయని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాయని తెలిపారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. ఈ మొత్తం ఉదంతంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని కమల్‌నాథ్ డిమాండ్ చేశారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో మరో ఆరు ఎయిర్‌పోర్టులు

Advertisement

తాజా వార్తలు

Advertisement