Sunday, October 6, 2024

TG | వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఒవైసీ అసదుద్దీన్

నిజామాబాద్ ప్రతినిధి, (ప్రభ న్యూస్) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మోదీ ప్రభుత్వం మైనారిటీలపై చట్టాలు తీసుకొచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హైదరాబాద్ ఎంపీ ఒవైసీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. దేశంలోని 90 శాతం మసీదులకు ఎలాంటి యాజమాన్యాన్ని రుజువు చేసే పత్రాలు లేవని తెలిపారు. వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు చట్టంగా మారితే మసీదులు, ఇతర ముస్లిం మతస్థలాలను లాక్కుంటారని ఆరోపించారు.

ఒక్కసారి ముస్లింలు ఒక స్థలాన్ని ప్రార్థన స్థలంగా ఉపయోగించడం ప్రారంభిస్తే.. ఆ స్థలం శాశ్వతంగా ముస్లింల ఆస్తిగా మారుతుందని…. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ నిబంధనను మారుస్తుందని వెల్లడించారు. యువతలో మార్పు రావాలని పిలుపు నిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన నాయకుడు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. తద్వారా మన సమస్యలపై గొంతేతి పోరాడడానికి వీలుగా ఉంటుందన్నారు.

పాలస్తినాపై జరుగుతున్న దాడులపై కండన..

పాలస్తీనాపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో 40 వేలకు పైగా కుటుంబాలు మృత్యువాత పడ్డాయని వాపోయారు. సంవత్సరం పైగా పాలస్తీనా పై దాడులు జరుగుతున్న పట్టించుకోవ డంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

నిరుపేదల ఇల్లు కూలగొట్టడం ఏమిటి?

కొత్తగా నియమితులైన కాంగ్రెస్ రాష్ట్ర రథసారధి మహేశ్ కుమార్ గౌడ్‌ను ఒవైసీ శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరూ గ్యారెంటీ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ చూపాలి కానీ నిరుపేదల ఇళ్లను కూల్చివేయడంపై మండిపడ్డారు. అభివృద్ధి పేరిట ఎందరో మంది నిరుపేద కుటుంబాలను రోడ్డున వేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2013 సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెచ్చిన యాక్టులో వచ్చిన నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బఫర్ జోన్ లో ఉన్న సచివాలయం ట్యాంక్ బండ్ సంగతేంటి?

తెలంగాణ నూతన సచివాలయం, ట్యాంక్ బండ్ ప్రాంతం, ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన విగ్రహాలు, ఈ ప్రాంతం మొత్తం బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని.. అయితే వీటిని కూడా తొలగిస్తారా లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోతే పేదల ఇళ్లను ఎలా కూల్చివేస్తారని అన్నారు.

రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటుతాం..

త్వరలో రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటుతామని ఓవైసీ ధిమా వ్యక్తం చేశారు. మహమ్మద్ వక్త పై చేసిన వాక్యాలను ఖండిస్తూ మహారాష్ట్రలో నిర్వహించిన ర్యాలీని చూసీ ప్రధాని మోదీ, అమిత్ షా, బిజెపి ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురైందని ఎద్దేవా చేశారన్నారు. మోదీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని ఓవైసీ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement