హైదరాబాద్, ఆంధ్రప్రభ: జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలను ఎన్టిఏ మార్చడంతో దాని ప్రభావం ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూలుపై పడింది. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్ష తేదీలు మారనున్నాయి. పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తూ షెడ్యూల్‌ను ఎన్టీఏ మార్చడంతో మే 5 లేదా 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇంటర్, పదో తరగతి పరీక్ష టైం టేబుల్ మార్చాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది.
ఈమేరకు అధికారులు పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన ఫైల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమర్పించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ అనుమతి తీసుకొని నేడో రేపో కొత్త షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ పరీక్షలు, మే 11 నుంచి 20 వరకు పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జేఈఈ రీషెడ్యూల్ కారణంగా షెడ్యూల్ మారే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..