ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించేందుకు ఇండస్ట్రీ అంగీకరించింది. ప్రస్తుతం దీనిపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై మాత్రమే 28 శాతం జీఎస్టీ వసూలు చేయాలని, ఎంట్రీ ఫీజుపై జీఎస్టీ వసూలు చేయవద్దని కోరింది. మన దేశంలో గేమింగ్ పరిశ్రమ 2.2 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది. ఆన్‌లైన్ గేమ్‌లో పాల్గొనే వారి నుంచి వసూలు చేసే ఫీజును జీజీఆర్‌గా పరిగణిస్తారు.
గేమింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి గేమ్ ఆడేందుకు పాల్గొనే వారు డిపాజిట్ చేసే డబ్బును ఎంట్రీ అమౌంట్ (సీఈఏ)గా పరిగణిస్తారు. ఇప్పటికే మంత్రుల కమిటీ ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలని సూచించింది. జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 17న సమావేశం కానుంది. ఈ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.