Tuesday, November 19, 2024

పది పరీక్షల్లో మరిన్ని ఛాయిస్‌లు! ప్రశ్నలతో పాటు ఆబ్జెక్టివ్ బిట్స్‌ను పెంచే చాన్స్‌..

మేలో జరగబోయే పదో తరగతి వార్షిక పరీక్ష ప్రశ్నల్లో విద్యార్థులకు మరిన్ని ఛాయిస్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు అధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లుగా పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు కరోన కారణంగా హాజరు కావడంలేదు. దాంతో వారిని పై తరగతులకు ప్రభుత్వం ప్రమోట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ విద్యాసంవత్సరం వార్షిక పరీక్షలను నిర్వహిస్తోంది. కాగా, మేలో పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

గతేడాది మాదిరిగానే కరోనా కారణంగా ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమైన విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేందుకు 30 శాతం సిలబస్‌ను తగ్గించి, ప్రశ్నల్లో ఛాయిస్‌లను ఇవ్వాలనుకుంది. కానీ ఈ ఏడాది కూడా విద్యార్థుల చదువులపై ఒమిక్రాన్‌ ప్రభావం పడడంతో ప్రశ్నపత్రాల్లో మరిన్ని ఛాయిస్‌ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించనున్నారు. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలను పెంచే యోచనలో విద్యాశాఖ అధికారులున్నట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement