పెరిగిన పెట్రోల్ డీజీల్ ధరలకు నిరసనగా విపక్షపార్టీలు పార్లమెంట్ ఆవరణలో నిసనలు తెలియజేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆ ర్యాలీలో విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. పెగాసస్ వ్యవహారం, పెట్రో ధరలు, సాగు చట్టాల రద్దు అంశంలో కేంద్ర వైఖరిని ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి. మాక్ పార్లమెంట్ నిర్వాహించాలని విపక్షాలు భావిస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతకుముందు లోక్‌సభ, రాజ్యసభకు చెందిన విపక్ష పార్టీలు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్‌లీడర్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. విపక్ష పార్టీ నేతలతో కాన్‌స్టూషన్ క్లబ్లో సమావేశం జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్, లోకతాంత్రిక్ జనతాదళ్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మనం అంతా కలిసి పోరాడాలని రాహుల్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్వరం వినిపిస్తే, మన స్వరం అంత బలంగా మారుతుందని కాంగ్రెస్ నేత తెలిపారు. విపక్ష పార్టీ నేతలతో బ్రేక్‌ఫాస్ట్ ముగిసిన తర్వాత.. సైకిల్ యాత్ర చేపట్టారు.
పెట్రో ధరలకు నిరసనగా విపక్షాల సైకిల్ యాత్ర..
- Tags
- breaking news telugu
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- RAHUL GANDHI
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement