Friday, November 22, 2024

ఆపరేషన్‌ ముస్కాన్ జులై నెలంతా అమలు.. బాల కార్మికుల‌ను కాపాడ‌డ‌మే ల‌క్ష్యం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది జులై నెల మొత్తం బాలకార్మికులను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసే లక్ష్యంతో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మహిళా, శిశు విభాగం ఏడీజీపీ స్వాతి లక్రా నేతృత్వంలో ప్రత్యేకంగా వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ను నిర్వహించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ ను నిర్వహణలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకునే విధానం, బాలకార్మికులను పనిలో పెట్టుకున్న వారికి గరిష్ట శిక్షలు పడేలా దర్యాప్తు చేయాల్సిన విధానంపై చర్చించారు.

ఈ కాన్ఫరెన్స్‌ లో పోలీసుశాఖతోపాటు వివిధ శాఖలకు చెందిన 785 మంది అధికారులు పాల్గొన్నారు. కార్మిక, శిశు సంక్షేమ, పోలీసు, ఎన్‌జీవోలను కలుపుకుని సమన్వయంతో ఆపరేషన్‌ ముస్కాన్‌ను చేపట్టి బాలకార్మికులకు విముక్తి కల్పించాలని నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement