Monday, November 25, 2024

ఆప‌రేష‌న్ గ‌జ స‌క్సెస్‌.. అదుపులోకి వచ్చిన ఒంటరి ఏనుగు..

చిత్తూరు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో రెండు రోజులుగా హ‌ల్‌చ‌ల్‌ చేస్తున్న ఒంటరి ఏనుగును అటవీశాఖ అధికారులు ఈ రోజు (గురువారం) అదుపులోకి తీసుకున్నారు. గుంపునకు దూరమై అటవీ ప్రాంతం నుంచి ఊళ్ల వైపు వచ్చిన ఆ ఏనుగు అటు తమిళనాడులో ఒకరిని, ఇటు చిత్తూరు జిల్లాలో ఇద్దరినీ బలితీసుకుంది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఆపరేషన్ గజ పేరుతో ననియాల ప్రాజెక్టు నుంచి తెచ్చిన రెండు కుంకీ ఏనుగుల సాయంతో ఆ ఏనుగును అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు నిన్న ప్రారంభించారు.

ఈరోజు మధ్యాహ్నం 197 రామాపురం వద్ద పొలాల్లో చెరుకు తోటలో ఉన్న ఒంటరి ఏనుగు పై తుపాకీతో మత్తుమందు ప్రయోగించారు. మత్తులో ఉన్న ఏనుగును రెండు కుంకీ ఏనుగుల సహాయం తో అదుపులోకి తెచ్చారు.కుంకీలు సహాయంతో ఒంటరి ఏనుగును తిరుపతి జూ పార్కు తరలించేందుకు అటవీ శాఖ ప్రయత్నిస్తున్నారు. తిరుపతి జూ పార్కులో ఆ ఏనుగు ను ఉంచి దానిని సత్ప్రవర్తన దిశగా శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా ఏనుగు దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ 10 లక్షలు చెక్కు ను చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి అందచేశారు దీంతో రెండు రోజులుగా చిత్తూరు ప్రాంతాన్ని గజగజలాడించిన ఒంటరి ఏనుగు
అదుపులోకి రావడంతో గ్రామీణ ప్రజలు, అటవీ, పోలీస్ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement