:ఇజ్రాయిల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారుతున్న నేపథ్యంలో భారతదేశం, ఇజ్రాయిల్ లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ని ప్రారంభించింది. ఇజ్రాయిల్ లో భారతీయులు 18,000 మంది ఉన్నారు. ప్రత్యేక చార్టర్ విమానాల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు.
విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇజ్రాయిల్ నుంచి తిరిగి రావడానికి నమోదు చేసుకున్న భారతీయులను రేపు ప్రత్యేక విమానం ద్వారా ఇండియాకు తరలిస్తామని ఇజ్రాయిల్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి ఎంబసీ ఈమెయిళ్లను పంపింది. రేపు స్పెషల్ ఫ్లైట్ ద్వారా స్వదేశానికి వస్తున్నారు. తరువాత మిగిలిన వారిని దశల వారీగా ఇండియాకు తీసుకువస్తారు