Tuesday, November 26, 2024

Operation Ajay – ఇజ్రాయేల్ నుంచి మ‌రో 235 మంది రాక

న్యూఢిల్లీ – ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శనివారం తెల్లవారుజామున యుద్ధంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశం నుంచి రెండవ బ్యాచ్ భారతీయ పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇద్దరు శిశువులతో సహా 235 మంది భారతీయ పౌరులతో విమానం శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
అక్టోబర్ 7వతేదీన గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దాడుల నేపథ్యంలో స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారిని సులభతరం చేయడానికి భారతదేశం గురువారం ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ నుండి 212 మంది భారతీయ పౌరులతో ఆపరేషన్ అజయ్ కింద మొదటి చార్టర్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.

డు మ‌రో విమానం భార‌తీయుల‌తో ఢిల్లీలో ల్యాండ్ అయింది. కాఆ, భార‌తీయులందరూ మిషన్ యొక్క డేటాబేస్లో పేర్ల నమోదు చేసుకోవడానికి భారత రాయబార కార్యాలయం ప్రారంభించిన డ్రైవ్ తర్వాత ప్రయాణీకులను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఎంపిక చేశారు. వారి విమాన చార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement