ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది.
‘ఆపరేషన్ అజయ్’ పేరుతో భారత ప్రభుత్వం తరలింపు చర్యలు చేపట్టింది. తొలి విమానంలో 212 భారతీయులు స్వదేశం చేరుకున్నారు. ఇజ్రాయెల్ – హమాస్ (పాలస్తీనా) మధ్య యుద్ధంతో అంశాంతి వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌లో సుమారు 18వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ‘ఆపరేషన్ అజయ్’పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయుల్లో విద్యార్థులే అధికంగా ఉన్నారు. వైద్యం, వ్యవసాయం, టెక్నాలజీ తదితర రంగాల్లో విద్యాభ్యాసం, పరిశోధనల కోసం భారతీయులు ఇజ్రాయెల్ వెళ్లారు. ఇజ్రాయెల్ నుంచి తొలి విమానంలో వచ్చిన భారతీయులు టెల్ అవీవ్, హైఫా నగరాల్లో నివసిస్తున్నారు