చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. 81/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ ఇండియా వీర బాదుడు బడి 287/4 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్; 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్ (109; 128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో కదం తొక్కారు.
కాగా, 515 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన బంగ్లాదేశ్…. మూడో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. విజయానికి బంగ్లాదేశ్ 357 పరుగుల దూరంలో ఉంది. అయితే, భారత బౌలర్లను ఎదురుకుని రెండు రోజులు బంగ్లా బ్యాటర్లు ఏ మేరకు నిలుస్తారనేదే ఆసక్తికరం.
బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్ (33; 47 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్), షాద్మాన్ ఇస్లామ్ (35; 68 బంతుల్లో, 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. రెండో సెషన్ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన వీరద్దరు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే, వికెట్లు పడుతున్న బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (51 బ్యాటింగ్; 60 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం చేశాడు. ఇక భారత బౌలర్లలో బుమ్రా (1/18), రవిచంద్ర్ అశ్విన్ (3/63) వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్), రిషభ్ పంత్ (109) శతకాలతో కదం తొక్కారు. కేఎల్ రాహుల్ (22 నాటౌట్) అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్ రెండు వికెట్లు, తస్కిన్, నహిద్ తలో వికెట్ తీశారు.
కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86) సత్తాచాటారు. హసన్ మహ్మద్ (5/83) అయిదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. షకిబ్ అల్ హసన్ (32) టాప్ స్కోరర్. జస్‌ప్రీత్ బుమ్రా (4/50) నాలుగు వికెట్లు తీశాడు.