ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన బిలియనీర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద షాకే తగిలింది. బిలియనీర్లలో అత్యంత సంపన్నులైన 500 మందికి చెందిన 1.4 ట్రిలియన్ డాలర్ల మొత్తం ఆవిరైంది. ఇది కేవలం తొలి ఆరునెలల్లో ఏర్పడిన నష్టం. ఇంత పెద్దమొత్తంలో సంపదను కోల్పోయిన ఉందంతం ఇంతవరకూ ఎప్పుడూ లేదు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ సంస్థ అధ్యయనం వెల్లడించింది. అయితే భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ మాత్రం ఇదే సమయంలో లాభాలను చవిచూసి సంపదను మరింత పెచుకోగలిగారు. ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలన్ మస్క్ దాదాపు 62 బిలియన్ డాలర్ల మొత్తాన్ని కోల్పోగా, జెఫ్ బొజేస్ 64 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయారు. ఇక మార్క్ జుకర్‌బెర్గ్ మూల సంపదలో సగానికి సగం ఆవిరైపోయిందని అధ్యయనం పేర్కొంది. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో ఆర్థిక రంగం కుదేలవడం, ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు అసాధారణ నిర్ణయాలు, నిబంధనల మార్పు ప్రభావం వీరిపై పడింది. ఫలితంగా టెక్ కంపెనీలు, క్రిఎ్టో కరెన్సీ విలువలు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కళ్లెం వేసేందుకు విధాన నిర్ణాయక వర్గాలు వడ్డీరేట్లను పెంచుతున్నారు.
ఫలితంగా అత్యంత విలువైన షేర్ల విలువ పడిపోతూండటంతో ఆ షేర్లను కలిగిన సంపన్నులు వేగంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు టెస్లా జూన్ త్రైమాసికంలో ఎన్నడూ లేని నష్టాలను చవిచూసింది. అదేవిధంగా అమెజాన్.కామ్ కామ్ షేర్లు కూడా నేలచూపులు చూడటంతో నష్టాలు తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా సంపద కొంతమంది చేతుల్లోనే చిక్కుకుంది. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, టెస్లా వ్యవస్థాపకుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ 208.5 బిలియన్ డాలర్లకు యజమాని. ఇక అమెజాన్ అధినేత బెజోస్ ప్రపంచ సంపన్నుల్లో రెండోస్థానంలో ఉండగా అతడి సంపద విలువ 129.6 బిలియన్ డాలర్లు. ఫ్రాన్స్‌లో అత్యంత సంపన్నుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ 128.7 బిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 114.8 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. కాగా తొలి ఆరునెలల్లో వీరి సంపద పెద్దమొత్తంలో ఆవిరైంది. 1970 తరువాత ఈ స్తాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. కరోనా కారణంగా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఆ ప్రభావం వీరిపై పడింది. నిజానికి సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునేందుకు ఇలాంటి సంపన్నలు ప్రయత్నిస్తూండటం మామూలే. అయితే, ఈసారి వారి ప్రయోగాలు ఫలించలేదు. ఫలితంగా 2022 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ బాగంలో బిలియనీర్ సంపన్నులు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర సంపదను కోల్పోయారు. కానీ భారత్‌కు చెందిన బిలియనీర్ సంపన్నుల్లో ఒకరైన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాత్రం లాభాలు గడించడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.