Saturday, November 23, 2024

ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు.. రూ.1.15కోట్లు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

అమీర్‌పేట్‌, ప్రభన్యూస్‌ : ఆన్‌ లైన్‌ గేమింగ్‌ యాప్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను ఎస్‌ ఆర్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.15 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయేల్‌ డేవిస్‌ తెలిపిన వివరాల ప్రకారం. ఆన్‌ లైన్‌ గేమింగ్‌ ద్వారా బెట్టింగ్‌ లు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్‌ ఆర్‌ నగర్‌ పోలీసులు బీకే గుడా పార్క్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ ఆర్‌ నగర్‌ డిఐ రామ ప్రసాద్‌ ఆధ్వర్యంలో క్రైమ్‌ ఎస్‌ఐ లు శ్రీకాంత్‌ గౌడ్‌, గిరిధర్‌ ఈ ముఠాపై నిఘా పెట్టి వారిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. గుజరాత్‌ కు చెందిన దర్మేశ్‌ భాయ్‌ అనే వ్యక్తి ఆన్‌ లైన్‌ గేమింగ్‌ యాప్‌ రూపొందించి అందులో 50వేల రూపాయల వరకు రిజిస్టర్‌ చేసుకోవచ్చని, అంతకంటే ఎక్కువ అయితే తన సిబ్బందిని పంపి ఐడీ కార్డులు ఇస్తానని నమ్మిస్తూ హైదరాబాద్‌ కేంద్రంగా బెట్టింగ్‌ లు నిర్వహిస్తున్నాడు.

ఇతనికి విశాల్‌ పటేల్‌, కమలేష్‌ రావత్‌, పటేల్‌ హితేష్‌ అంబాల అనే ముగ్గురు వ్యక్తులు ఏజెంట్లు పనిచేస్తున్నారని, గుట్టు చప్పుడు కాకుండా పంటర్స్‌ నుంచి డబ్బులు కలెక్ట్‌ చేస్తున్నారు. ఆన్‌ లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురిని ఎస్‌ ఆర్‌ నగర్‌ పోలీసులు పంటర్స్‌ గా కాల్‌ చేసి ట్రాప్‌ చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రధాన నిందితుడు ధర్మేష్‌ భాయ్‌ అనే అతను పరారీలో ఉన్నాడని, ముగ్గురు నిందితులను రిమాండ్‌ కు తరలించామని, నిందితుల నుంచి క్యాష్‌ కౌంటింగ్‌ మిషిన్‌, నాలుగు సెల్‌ ఫోన్లు, రూ.1. 15 కోట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వివరించారు. ఆన్‌ లైన్‌ గేమింగ్‌ లతో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన యువతను హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement