Friday, November 22, 2024

బీఎస్సీ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: బీఎస్సీ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో 24 నుంచి 26 వరకు మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో యూనివర్సిటీ పరిధిలోని మొదటి విడత కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈనెల 24న ఉదయం 8 గంటల నుంచి 26న సాయంత్రం 4 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, మెరిట్‌ జాబితా అదేవిధంగా కళాశాల వారీగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లొ చూసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement