Saturday, November 23, 2024

యాజమాన్య కోటా బీహెచ్‌ఎంఎస్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. 19వ తేది వరకు గడువు

వరంగల్‌ ప్రభన్యూస్‌ ప్రతినిధి: యాజమాన్య కోటా బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇవ్వాల (శనివారం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలలోని యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 12వ తేది ఉదయం 8 గంటల నుంచి 19వ తేది సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

నీట్‌-2022 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ సీట్లకు దర ఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత దరఖాస్తుల పరిశీలన, ఆప్షన్ల నమోదుకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. మరింత వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement